ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీ...దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్

ఈ మాటలు అన్నది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన ఒక వెబ్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-09-12 18:30 GMT

ఈ మాటలు అన్నది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన ఒక వెబ్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ ని అని స్పష్టంగా చెప్పారు. 2028 నాటికి తన రాజకీయ జీవితానికి 50 ఏళ్ళు పూర్తి అవుతాయని చంద్రబాబు చెప్పారు. దేశంలో తనంత సీనియారిటీ మరొకరికి ఉండబోదని అన్నారు. ఆ వెబ్ మీడియా నిర్వహిస్తున్న కాంక్లేవ్ లో చంద్రబాబు పాల్గొని ఎన్నో విషయాల మీద తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అవును నిజమే :

బాబు 1978లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటికి బాబు నవ యువ ఎమ్మెల్యే. యువకుడిగా ఉంటూ పెళ్ళి కూడా కాకుండానే మంత్రి అయిన రికార్డు సైతం ఆయనకే ఉంది. అలా కాంగ్రెస్ మంత్రిగా కీలక శాఖలు చూసిన చంద్రబాబు పన్నెండేళ్ళు తిరగకుండానే ఉమ్మడి ఏపీకి సీఎం అయిపోయారు. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. ఏకంగా తొమ్మిదేళ్ళ పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన బాబు విభజన ఏపీకి తొలి సీఎం గా మరో రికార్డు సాధించారు. 2024లో బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన నాయకత్వంలోని టీడీపీ కూటమి గెలిచింది. 2029 కల్లా బాబు తెలుగు నాట అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన సీఎం గా కూడా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా తెలుగు నాట సీఎం గా పనిచేసిన వారుగా బాబు తప్ప సమీప భవిష్యత్తులో మరొకరు కనిపించరని కూడా చెప్పాలి.

ఏపీ అభివృద్ధి మీద :

ఇక ఇందే కాంక్లేవ్ లో బాబు ఏపీ అభివృద్ధి గురించి తన విజన్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. అమరావతి రాజధానితో పాటు అక్కడ ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులు రాబోయే మూడేళ్లలో పూర్తి అవుతాయని చంద్రబాబు చెప్పారు. అమరావతితో పాటుగానే . విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల అభివృద్ధిపై ఫోకస్ పెడుతున్నామని బాబు చెప్పారు. అంతే కాదు సేవల రంగం ద్వారా ఎక్కువ గ్రోత్ సాధించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. అమరావతి రాజధాని తొలి దశ పనులు పూర్తి అయితే కనుక 50 వేల కోట్ల రూపాయల విలువైన ఇన్‌ఫ్రా అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. ఇక అమరావతి రాజధాని పనులు పూర్తి అయిన ఆ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రారంభిస్తారని కూడా చంద్రబాబు చెప్పారు.

పోలవరం పరిపూర్తి :

ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. 2027 సెప్టెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరంపై ఫోకస్ పెట్టామని, దానికి తగినట్లుగా కేంద్రం కూడా నిధులు ఇచ్చిందని ఆయన అన్నారు. 2019లో గెలిచి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తి అయ్యేదని ఆయన చెప్పారు. ఇక గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఆయన విమర్శించారు.

పబ్లిక్ సెంట్రిక్ గా పాలసీలు :

సమాజంలో వివిధ వర్గాల ప్రజానీకం ఉంటారని అందరినీ కలుపుకుని పోవాల్సి ఉందని బాబు అన్నారు. అంతే కాదు అందరూ అన్ని అందిపుచ్చుకోలేరని అందుకే రకరకాల పబ్లిక్ పాలసీలు తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. అంతే కాదు అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక స్పష్టమైన విధానం ద్వారా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయరును ఒక్క ఏడాదిలో పూర్తి చేసి నీరిచ్చామని ఆయన గుర్తు చేశారు. అలాగే హంద్రీ నీవా ప్రాజెక్టు కాల్వల విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరు ఇచ్చామని చెప్పారు.

ప్రపంచంలో సంక్షోభాలు :

వర్తమానంలో చూసుకుంటే ప్రపంచంలో అనేక దేశాలలో సంక్షోభాలు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు అయితే ఆ తరహా ఇబ్బందులు భారత్ కి ఎప్పటికీ రావు అని ధీమాగా చెప్పారు సుస్థిరతకు నాయకత్వానికి మారు పేరు భారతదేశమే అని చంద్రబాబు అన్నారు. ఇక ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూస్తే కనుక దేశంలో సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రిని నేనే అని బాబు చెప్పారు. అంతే కాదు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపై ఫోకస్ పెట్టామని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ కి రాజధాని హైదరాబాద్‌కు ఉన్న అడ్వాంటేజేస్ కారణంగా ఎక్కువగా అభివృద్ధి చెందిందని బాబు విశ్లేషించారు. .

Tags:    

Similar News