పోలీసులకు ఫోర్ ఆర్ గురించి చెప్పిన బాబు

లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు.;

Update: 2025-09-14 03:41 GMT

లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా కానీ నేరం జరిగితే కచ్చితంగా చర్యలు ఉండాల్సిందే అని అన్నారు. అంతే కాదు పోలీసుల దర్యాప్తులో దూకుడు పెంచాలని ఆయన కోరడం విశెషం. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ ఫోర్ ఆర్ విధానం ఏపీలో అమలు చేయాలని సూచించారు. ఫోర్ ఆర్ లతోనే ఏపీలో పటిష్టమైన శాంతి భద్రతలు ఉంటాయని ఆయన దిశా నిర్దేశం చేస్తున్నారు.

రాజకీయ ముసుగులో నేరాలు :

నేరాలు అన్నది చాలా జరుగుతున్నాయని అవి కొత్త రూపు సంతరించుకున్నాయని చంద్రబాబు చెప్పడం విశేషం. అందువల్ల ఎలాంటి ఉపేక్ష అన్నది లేకుండా లాఠీ తీయాల్సిందేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో శాంతి భద్రత ల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని ఈ విషయం లో రాజీ అనేది లేదని బాబు అంటున్నారు. రాజకీయ ముసుగులో నేరాలను అసలు ఉపేక్షించకూడదని సూచించారు. నేరాల తీరు మారిందని బాబు చెబుతూ కొత్త తరహా నేరాలతో పాటు సరికొత్త తరహా నేరస్తులు వచ్చారని అంటున్నారు. ఈ విషయంలో పోలీసు లు కూడా అప్ డేట్ కావాలన్నారు.

అభివృద్ధి కోసమే :

శాంతి భద్రతలు ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టుబడులు వస్తాయని అలాగే అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు. పెట్టుబడులు వస్తే ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని రాష్ట్ర గ్రోత్ రేట్ పెరుగుతుందని బాబు చెప్పుకొచ్చారు. తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే తన విధానం అని బాబు పోలీసు అధికారులకు గుర్తు చేశారు

అప్డేట్ కావాల్సిందే :

ఇక పోలీసు అధికారులు కానీ వారి సిబ్బంది రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ అనే విధానంలో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఫోర్ ఆర్ ల గురించి బాబు వివరించారు. ఎక్కడైనా ఏదైనా తీవ్రమైన ఘటన జరిగిన వెంటనే కిందిస్థాయి సిబ్బందిపై వదిలేయకుండా వెంటనే రియాక్ట్ అవాలి, అలాగే అవసరమైన మేరకు క్రైమ్ స్పాట్ కు రీచ్ కావాలి. అక్కద సాక్ష్యాధారాల సేకరణ దర్యాప్తులో అవసరమైన చర్యలు చేపట్టేలా వెంటనే రెస్పాండ్ కావాలని కోరారు. అలా చూస్తే కనుక పై స్థాయి నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకూ రియాక్ట్ , రీచ్, రెస్పాండ్ , రిజల్ట్ విధానాలను అవలంబించాలని బాబు సూచించారు. అలా బెస్ట్ పోలీసింగ్ ని ఏపీలో నెలకొల్పాలని ఆయన చెప్పడం విశేల్షం.

సోషల్ మీడియా ఫేక్ గాళ్ళకు :

మరో వైపు సోషల్ మీడియా ద్వారా ఫేక్ పోస్టులు పెట్టే వారి భరతం పట్టాలని బాబు కోరారు. దీని వల్ల సమాజంలో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని ఆయన అన్నారు. ఫేక్ పోస్ట్ క్రియేట్ చేసే వారి విషయంలో తగిన విధంగా స్పందించాల్సిందే అన్నారు.

Tags:    

Similar News