అభివృద్ధి కోసమే భూసేకరణ...క్లారిటీ ఇచ్చిన బాబు

భూముల సేకరణ సమీకరణ ఈ రెండు విషయాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి.;

Update: 2025-12-18 02:30 GMT

భూముల సేకరణ సమీకరణ ఈ రెండు విషయాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. ఉమ్మడి ఏపీ సీఎంగా బాబు ఉన్నపుడు భూ సేకరణ విషయంలో ఇంత అవసరం కానీ ప్రణాళికలు కానీ లేవు కానీ విభజన ఏపీలో మాత్రం అన్నీ అవసరం అవుతున్నాయి. ఏపీ రాజధాని లేకుండా విభజించబడింది. దాంతో రాజధాని కోసం భూ సమీకరణ అనంది మొదలెట్టారు. ఆ తరువాత ఇతర ప్రాజెక్టుల కోసం సైతం భూములు తీసుకుంటున్నారు. అయితే ఈ భూసేకరణ ఎపుడూ టీడీపీ నాయకత్వంలో చంద్రబాబు సారధ్యంలో ఇబ్బందులు అయితే సృష్టించలేదు. భూములు ఇచ్చేందుకు ప్రజలు కూడా స్వచ్చందంగా ముందుకు వచారు. దాని మీదనే ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఫోకస్ చేస్తూ మాట్లాడారు.

భూ వివాదాలు లేవు :

తాము అధికారంలో ఉండగా ఎక్కడా భూ వివాదాలు చోటు చేసుకోలేదని ఆయన కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెబుతూ అవి అన్నీ సాకారం కావాలంటే భూసేకరణ అన్నది చాలా ముఖ్యమని చంద్రబాబు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ముఖ్య ప్రాజెక్టులన్నిటికీ భూసేకరణ అత్యంత కీలకం అని బాబు చెప్పుకొచ్చారు. అయితే భూములు ఇచ్చే వారు కూడా సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే భూసేకరణలో ప్రజాప్రతినిధుల సహకారం కలెక్టర్లు తీసుకోవాలని కోరారు.

లక్షల కోట్ల పెట్టుబడులు :

ఇక ఏపీలో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాకారం కావాల్సి ఉందని అన్నారు. అది జరిగితేనే 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని బాబు అన్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీసం లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రావాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైతే మూడు వేల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లుగా చెప్పారు అదే విధంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్లను కోరారు.

గ్రౌడింగ్ ప్రాసెస్ స్టార్ట్ :

ఇక తాను జనవరిలో దావోస్‌కు వెళ్లేముందుగా ఇప్పటిదాకా చేసుకున్న 538 ఎంఓయూలు అలాగే 11.38 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ ప్రాసెస్ మొదలు కావాలని చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆ దిశగా పూర్తి స్థాయిలో కసరత్తు జరగాల్సి ఉందని అన్నారు. ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయని ఆయన చెప్పారు. అలాగే మంత్రులు కలెక్టర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను లాంచ్ చేసేలా కృషి చేయాలని బాబు కోరడం విశేషం.

సర్వీస్ సెక్టార్ పైనే :

ఏపీలో సర్వీస్ సెక్టార్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాల్సి ఉందని బాబు అన్నారు. సేవల రంగం కూడా మరింతగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే చాలా ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందాలంటే హోటళ్లు కూడా పెద్ద ఎత్తున నిర్మితం కావాల్సి ఉందని బాబు చెప్పారు. ఈ విషయంలో కూడా జిల్లాల స్థాయిలో యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

టౌన్ షిప్ అక్కడ :

ఇదే విధంగా భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోనే టౌన్ షిప్ అభివృద్ధి చేయండని బాబు కలెక్టర్లను కోరారు. దాని వల్ల ఆయా ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధిని సాధిస్తాయని ఆయన అన్నారు. ఇదే విధంగా అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో ప్రాజెక్టులు ఎక్కడైతే వస్తాయో అక్కడ ఈ తరహా ప్రణాళికను ముందుకు తీసుకుని పోవాల్సి ఉందని కలెక్టర్ల సదస్సులో బాబు సూచించారు.

Tags:    

Similar News