పాస్‌బుక్కుల‌పై ఫొటోలు వేసుకుని.. ఫెయిల‌య్యారు: చంద్ర‌బాబు

వైసీపీపైన‌.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌పైనా ఏపీ సీఎం చంద్ర‌బాబు సెటైర్లు వేశారు. ''పాస్‌బుక్కుల‌పై ఫొటోలు వేసుకున్న వారు.. పాస్‌కాలేదు.. ఫెయిల్ అయ్యారు'' అని ఎద్దేవా చేశారు.

Update: 2026-09-30 13:17 GMT

వైసీపీ పైన‌.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌పైనా ఏపీ సీఎం చంద్ర‌బాబు సెటైర్లు వేశారు. ''పాస్‌బుక్కుల‌పై ఫొటోలు వేసుకున్న వారు.. పాస్‌కాలేదు.. ఫెయిల్ అయ్యారు` అని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తార‌ని.. ప్ర‌జ‌ల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేసిన వారు బుట్టదాఖ‌ల‌య్యార‌ని వ్యాఖ్యానించారు. అందుకే.. త‌మ కూట‌మి ప్ర‌భుత్వంలో అన్నీ పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నించేలా.. వ్య‌వ‌స్థ‌ను ఏఐతో అనుసంధానం చేస్తున్నామ‌న్నారు. ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం పెంచుతున్నామ‌న్నారు.

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన `పేద‌ల‌కు ప‌ట్టాభిషేకం` కార్య‌క్రమంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 22 వేల మందికిపైగా పేద‌ల‌కు ఇంటి ప‌ట్టాల‌ను పంపిణీ చేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. కొంద‌రికి స్వ‌యంగా ఆయ‌న ప‌ట్టాలు పంపిణీ చేశారు. అనంత‌రం.. నిర్వ‌హించిన స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. కొంద‌రు త‌మ‌కు స్థ‌లాలు ల‌భించ‌క‌.. ప్ర‌భుత్వ భూముల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్నార‌ని.. అవి ప్ర‌భుత్వానికి ఎలానూ నిరుప‌యోగం అయిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు ఇచ్చేయ‌డ‌మే మేల‌ని భావించామ‌న్నారు.

ఇలా మంగ‌ళ‌గిరి, విశాఖ‌, విజ‌య‌వాడ స‌హా.. ఇతర ప్రాంతాల్లోనూ పేద‌ల‌కు ప‌ట్టాలు ఇస్తున్నామ‌న్నారు. మ‌రోవైపు పేద‌ల‌కు టిడ్కో ఆవాసాల క‌ల్ప‌న జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌భుత్వం.. జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతోంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హకారంతో రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌డివ‌డిగా ముందుకు వెళ్తోంద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల ఉచిత ప్ర‌యాణానికి ఏసీ బ‌స్సుల‌ను కూడా ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు చెప్పారు. ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం అందుబాటు లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మ‌హిళ‌ల ఆర్థిక స్థితి గతుల్లో మార్పులు వ‌చ్చాయ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు.

అప‌శృతి..

చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో అనూహ్యంగా విద్యుత్ క‌ట్ అయింది. స‌భా ప్రాంగణానికి కొంత దూరంలో సోడా బండిని ఏర్పాటు చేసుకున్న వ్య‌క్తి వ‌ద్ద‌.. గ్యాస్ సిలిండ‌ర్ ఒక్క‌సారిగా పేలిపోయింది. గాలిలోకి ఎగిరిన సిలిండ‌ర్‌.. 20 మీట‌ర్ల మేర‌కు పైకి లేచి.. విద్యుత్ వైర్ల‌ను తాకింది. దీంతో షార్ట్ స‌ర్క్యూట్ ఏర్ప‌డి.. విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ఏం జ‌రిగిందో తెలియ‌క‌.. తొలుత పోలీసులుకూడా ఖంగారు ప‌డ్డారు. అయితే.. ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం లేక‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. సోడా బండి య‌జ‌మానిపై కేసు న‌మోదు చేశారు.

Tags:    

Similar News