ప‌ట్ట‌భ‌ద్ర ఎన్నిక‌లు: ఉద్యోగుల‌తో రేవంత్ భేటీ

తెలంగాణ‌లో ప‌ట్ట‌భ‌ద్ర నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో రెండు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Update: 2026-09-30 13:19 GMT

తెలంగాణ‌లో ప‌ట్ట‌భ‌ద్ర నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో రెండు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాస్త‌వానికి ఇంకా షెడ్యూల్ విడుద‌ల కాలేదు. అయితే.. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ముంద‌స్తు స‌న్నాహ‌కా లు ప్రారంభించింది. ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాలు.. మొత్తం ఆరు ఉమ్మడి జిల్లాల‌కు విస్త‌రించిన నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లోని ఉద్యోగుల‌ను సీఎం రేవంత్ రెడ్డి తాజాగా క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం పరంగా అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు.

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన బ‌కాయిల‌ను విడ‌త‌ల వారీగా ఇస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. క‌రీంన‌గ‌ర్‌లో కొత్త‌గా క‌లెక్ట‌రేట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే.. స‌మ‌యంలో ఉద్యోగుల‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. పైకి చెప్ప‌క‌పోయినా.. ఈ స‌మావేశం వెనుక ప‌ట్ట‌భ‌ద్ర ఎన్నిక‌ల వ్య‌వ‌హారం ఉంద‌న్న‌ది ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్న‌మాట‌. ఈ స‌మ‌యంలో ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు.

ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం త‌న కుటుంబ స‌భ్యుల్లా చూసుకుంటుంద‌ని అన్నారు. ఉన్నతాధికారులు కూడా ఉద్యోగు ల‌ స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే స్పందించాల‌ని.. వారికి ఇబ్బందులు క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌రాద‌ని పేర్కొన్నారు. అంద‌రి స‌హ‌కారం ఉంటే నే ప్ర‌భుత్వం సంక్షేమం స‌హా.. ఇత‌ర ప‌నులను ముందుకు తీసుకువెళ్తుంద‌ని చెప్పారు. ఉద్యోగులు.. ప్రజలకు సేవలందిస్తూనే త‌మ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులే 4 కోట్ల ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు.

ఇప్ప‌టికే ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను చాలా వ‌రకు ప‌రిష్క‌రించిన‌ట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. మిగిలిన స‌మ‌స్య‌ల‌ను కూడా సానుకూలంగా ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం(బీఆర్ ఎస్‌) మాదిరిగా ఎలాంటి నిర్బంధాలు విధించ‌డం లేద‌న్నారు. టార్గెట్లు కూడా పెట్ట‌డం లేద‌ని.. ఉద్యోగుల‌ను బాధ్యుల‌ను కూడా చేయ‌డం లేద‌ని చెప్పారు. మొత్తంగా.. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని చెప్ప‌డం ద్వారా.. వారిని సానుకూల ప‌రుచుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

Tags:    

Similar News