ఆ పని చేసి బాబు శభాష్ అనిపించుకున్నారు

కానీ ఆ పార్టీకి చెందిన నాయకుడి విగ్రహాన్ని కేవలం అమరావతిలోనే కాదు ఏపీలో మొత్తం 26 జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసి చంద్రబాబు రాజకీయ నేత స్థాయి నుంచి రాజకీయ కోవిదుడి స్థాయికి ఎదిగారు అని చెప్పక తప్పదు.;

Update: 2025-12-25 23:30 GMT

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మంచి పని చేశారు. అయితే ఇంతకాలం ఆయన ఏ మంచి పనీ చేయలేదా అని కాదు, గతంలోనూ ఇపుడూ కూడా ఎన్నో మంచి పనులు చేసారు, ఇంకా చేస్తారు కూడా. అయితే ఇది అలాంటి ఇలాంటి పని కాదు, ఏ రాజకీయ నేత చేయలేని పని. చేయాలనుకుంటేనే చేయగలరు, ఆ చేసే గుణం బాబుకి ఉంది కాబట్టే ఇదంతా మాట్లాడుకోవడం. ఇంతకీ బాబు చేసిన మంచి పని ఏమిటి అంటే అమరావతి రాజధానిలో ఏకంగా పదిహేను అడుగుల మోడీ విగ్రహం ఏర్పాటు చేయడం. నిజంగా బాబూ గ్రేట్ అనాల్సిందే.

ఎందుకంటే అందుకే :

బాబుని ఎందుకు పొగడాలి అంటే ఇందుకే అని గట్టిగా చెప్పాలి. తమ సొంత పార్టీ నేతలే దివంగతులైతే పట్టని సమాజం సాగుతోంది. తమ కంటే ముందు వారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పలేని బలహీనత పట్టి పీడిస్తోంది. అలాంటిది తమ పార్టీ కాదు అయినా కూడా దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నిలువెత్తు విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేసి ఆవిష్కరించిన బాబు ఘనతను వేయి నోళ్ళ పొగడక తప్పదు. బీజేపీతో బాబుకు పొత్తు ఉండి ఉండవచ్చు. ఇది ఎన్నికల రాజకీయానికే పరిమితం. మహా అయితే మరో ఎన్నిక దాకా కూడా సాగవచ్చు. ఇంకా చెప్పాలీ అంటే బీజేపీతో పొత్తులు టీడీపీకి గతంలో ఉన్నాయి మధ్యలో లేవు, మళ్లీ ఉన్నాయి. ఎందుకంటే అది రాజకీయం దాని అవసరం కధా వేరు.

రాజనీతి కోవిదుడుగా :

కానీ ఆ పార్టీకి చెందిన నాయకుడి విగ్రహాన్ని కేవలం అమరావతిలోనే కాదు ఏపీలో మొత్తం 26 జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసి చంద్రబాబు రాజకీయ నేత స్థాయి నుంచి రాజకీయ కోవిదుడి స్థాయికి ఎదిగారు అని చెప్పక తప్పదు. ఇదే విషయం తెలంగాణాకు చెందిన బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం ఏపీలో అన్ని జిల్లాలలో వాజ్ పేయి విగ్రహం పెట్టడం గొప్పగా ఉంది అని పొగిడారు. నిజం చెప్పాలీ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం జిల్లాకు ఒక వాజ్ పేయి విగ్రహం లేదు, మరి ఆ ఘనత ఏపీ బీజేపీ సాధించగలిగింది అది బాబు మంచితనం వల్లనే, అలాగే వాజ్ పేయి పట్ల ఆయనకు ఉన్న ప్రేమ అభిమానం వల్లనే అని అంటున్నారు.

బాబు ఓకే అన్నారు :

ఇక వాజ్ పేయి విగ్రహం అమరావతిలో ఆవిష్కరణ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ఈ ఆలోచన తనకు వచ్చిందని ఆ వెంటనే బాబుని కలిశాను అని చెప్పారు. తాను ఈ మ్యాటర్ చెప్పగానే బాబు తమకు కూడా వాజ్ పేయి అంటే ఎంతో ఇష్టమని అలాగే ఆయన విగ్రహాలు పెడతామని చెప్పి ప్రోత్సహించారు అని అన్నారు. దీనిని బట్టి చూస్తే బాబు విశాల హృదయంతో ఇదంతా చేశారు అనిపిస్తుంది. ఇక దేశంలో బీజేపీ ఎన్నో రాష్ట్రాలలో పొత్తు పెట్టుకుంది. మరి ఆ పొత్తు రాష్ట్రాలలో ఇదే మాదిరిగా వాజ్ పేయి విగ్రహాలు అయితే ఇప్పటిదాకా పెట్టలేదు, రేపటి రోజున పెట్టినా దానికి స్పూర్తి బాబు నాయకత్వమే అవుతుంది.

గౌరవంతోనే అంతా :

నాయకుడు అంటే తాను గౌరవం అందుకుంటూనే తన ముందు తరం వారిని కూడా గౌరవించుకోవాలి. బాబు ఇపుడు అదే చేశారు. పైగా దేశమంతా మెచ్చే వాజ్ పేయి విగ్రహాలు ఏపీలో అంతటా పెట్టించి ఒక మంచి వాతావరణం ఉండేలా చూశారు. ఇక బీజేపీ వారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, రేపటి రోజుల ఈ పొత్తుల ఎత్తులు ఏదో దశలో ముగింపునకు చేరినా బాబు విషయంలో ఏదైనా మాట అనాలీ అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ విగ్రహం రూపంలో వాజ్ పేయి అంతా చూస్తూనే ఉంటారు కాబట్టి.

Tags:    

Similar News