చిరంజీవితో చంద్రబాబు భేటీ..?
విశాఖ, అమరావతి కేంద్రంగా రాష్ట్రంలో సినీ పరిశ్రమను డెవలప్ చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలో చన. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే తెలుగు ఇండస్ట్రీ పరిమితం అయింది.;
మెగా స్టార్ చిరంజీవితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారా? సినిమా రంగానికి సంబంధించిన అంశా లతో పాటు.. ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా ఆయన చర్చించనున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి.. ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం చిరంజీవి విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాక.. నేరుగా అమరావతికి కానీ హైదరాబాద్‌కు కానీ పిలిపించుకుని చర్చించే అవకాశం ఉందని చెబు తున్నాయి. ఈ భేటీకి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారని తెలిసింది.
ఎందుకు?
విశాఖ, అమరావతి కేంద్రంగా రాష్ట్రంలో సినీ పరిశ్రమను డెవలప్ చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలో చన. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే తెలుగు ఇండస్ట్రీ పరిమితం అయింది. అయితే.. ఏపీలోనూ సినీ పరిశ్ర మను ప్రోత్సహిస్తే.. పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటకానికి ఇండస్ట్రీ హోదా కల్పించిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణలకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేయనున్నా రు. అదేవిధంగా లొకేషన్ల ఏర్పాటు, స్టూడియోల నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని తలపోస్తున్నా రు.
వాస్తవానికి గతంలోనే సినీ పరిశ్రమతో సీఎం చంద్రబాబు 2014-19 మధ్య చర్చించారు. అమరావతిలోనే స్టూడియోల నిర్మాణం.. కూడా చేపట్టాలని అప్పట్లో ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా అభివృద్ధి చెం దుతున్న విశాఖలోనూ నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు. కావాల్సిన మేరకు అనుమతులు వేగంగా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు చిరుతో భేటీ అవుతున్నట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ.. చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో చిరంజీవి కూడా పలు అంశాలపై స్పష్టత ఇస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కూడా సీఎం చంద్రబాబు చిరుతో ఆయా అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఈ భేటీపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి.