అడగడానికి ఏం లేదు.. చంద్రబాబు చేసేశారు!
ఇదేదో సినిమా డైలాగు కాదు. నిజమే!. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న పలు కీలక సమస్యలకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపించారు.
ఇదేదో సినిమా డైలాగు కాదు. నిజమే!. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న పలు కీలక సమస్యలకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వ పే-రివిజన్ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అలాగే పెండింగులో ఉన్న 4 డీఏల్లో 2 డీఏల విడుదలకు అంగీకరించారు. వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన పెండింగ్ అంశాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల ను సీఎం వారికి వివరించారు. రాష్ట్ర ఆదాయ-వ్యయాల లెక్కలను ఉద్యోగుల ముందు ఉంచారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా.... ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలతతో ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. 12వ పీఆర్సీ నియామకానికి అంగీకరించారు. అలాగే 1-7-2024, 1-1-2025లకు చెందిన రెండు డీఏల విడుదలకు ఆమోదం తెలిపారు.
సంక్రాతి పండగే!
ఈ రెండు డీఏలను 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించనున్నారు. ఇక 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవులను వచ్చే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాలో వేయడానికి అంగీకరించారు. ఇక పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్‌ను ఈ దసరాకు చెల్లించేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఇక గత ప్రభుత్వం రద్దు చేసిన పెన్షనర్ల అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ఇచ్చేందుకు నిర్ణయించారు.
దీనిలో భాగంగా 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింప చేయనున్నారు. ఇక ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్ చేస్తూ వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు చెల్లింపులు జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల కోసం తీసుకున్న ఈ నిర్ణయాలతో ఏటా రూ.2,880 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు కానుంది. అయినప్పటికీ.. చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఆయన చెప్పడానికి ఏమీ లేకుండా.. ఉద్యోగులు అడగానికి కూడా లేకుండా చేసేసినట్టు అయింది.