కూటమిలో పవన్ కృష్ణ సారథ్యం.. అక్కడ కీ రోల్...!
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. స్థానిక సమరంలో పవన్ కళ్యాణ్ కీలకం కావడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఉమ్మడిగా ముందుకు తీసుకురావడంలోను, భారీ విజయం దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యంత కీలక పాత్ర పోషించనున్నారన్నది కూటమిలో జరుగుతున్న చర్చ. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 100% విజయభేరి ఇచ్చిన ఉత్సాహంతో, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. స్థానిక సమరంలో పవన్ కళ్యాణ్ కీలకం కావడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. స్థానిక ఎన్నికలకు ఆయువు పట్టు వంటి.. గ్రామీణ అభివృద్ధి - పంచాయతీ రాజ్ పోర్ట్‌ఫోలియోపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నారు. ఉపాధి హామీ నిధుల విడుదల, గ్రామాల్లో పనుల నిర్వహణ, ఇటివల నిర్వహించిన చారిత్రాత్మక గ్రామ సభలు ఆయనకు గ్రామీణ ఓటర్లలో, ముఖ్యంగా తటస్థులలో భారీ క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.
కూటమి సమన్వయం విషయానికి వస్తే.. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఈ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటు, క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయం కుదర్చడంలో పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మహిళలు, యువత మద్దతును కూడ గట్టడంలోనూ కీలక రోల్ పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుపై దృష్టి పెట్టడం, పవన్ కళ్యాణ్ క్లీన్ పాలిటిక్స్ ఇమేజ్ మహిళా, యువ ఓటర్లను జనసేన వైపు ఆకర్షిస్తున్నాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో, క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఇటు జనసేన పార్టీకి అటు కూటమికి దిక్సూచిలా మారనున్నాయి. మొత్తంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అనుకూలంగా మారిన ఆయన వ్యూహాలు ఇప్పుడు కూడా సానుకూలంగానే మారనున్నాయని అంటున్నారు. ఈ పరిణామం కూటమికి మరింత బలం చేకూరుస్తుందని అంటున్నారు.