• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యనమల అల్లుడికి కీలక...

యనమల అల్లుడికి కీలక బాధ్యతలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కు ప్రాధాన్యం..

| టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణడు అల్లుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.

By - Tupaki Desk
Update: 2025-02-26 10:36 GMT

టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణడు అల్లుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనతోపాటు తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మరో లోక్ సభ సభ్యుడు డీఎం కతీర్ ఆనంద్ తో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీకి గుంటూరు పొగాకు బోర్డును అప్పగించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పొగాకు బోర్డు దేశంలో పొగాకు సాగు చేస్తున్న రైతుల సంక్షేమంతోపాటు పొగాకు వాడకం తగ్గించేలా చర్యలు తీసుకోవాల్సివుంటుంది. అయితే ఈ బోర్డుపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలా మంది ఉద్యోగులపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం లక్ష్యం కొడిగడిపోతుందనే భావించిన ప్రభుత్వ పెద్దలు ముగ్గురు ఎంపీలకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఇప్పటివరకు గుంటూరులో ఉన్న పొగాకు బోర్డుకు అఖిల భారత సర్వీసు క్యాడర్ అధికారి ఎండీగా ఉండేవారు. రాజకీయ పలుకుబడి ఉండే వ్యక్తిని చైర్మన్ గా నియమించేవారు. అయితే చైర్మన్ కు ఎలాంటి అధికారం లేకపోవడంతో కేవలం నామమాత్రంగా ఉత్సవ విగ్రహంలా మిగిలిపోయేవాడు. దీంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి పలు వివాదాలు, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయేవారు. ఇలా బోర్డు లక్ష్యం నీరుగారిపోయిందనే ఆవేదన వ్యక్తమయ్యేది. ఈ పరిస్థితుల్లో బోర్డును సంస్కరించాలని భావించిన కేంద్ర ప్రభుత్వం పొగాకు బోర్డులో ముగ్గురు ఎంపీలను సభ్యులుగా నియమించింది. పార్లమెంటు సభ్యులకు బోర్డు కార్యకలాపాలలో భాగస్వామ్యం కల్పిస్తే అక్కడ ఏం జరుగుతుందనేది ప్రభుత్వానికి అవగాహన ఉంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకే ఎన్డీఏ పార్టీలకు చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలకు బోర్డు సభ్యులుగా నియమించారు.

పొగాకు ఎక్కువగా సాగు అవుతున్న తెలుగు రాష్ట్రాల నుంచే ఇద్దరు సభ్యులను ఏర్పాటు చేయడంతో పొగాకు బోర్డు రూపు రేఖలు మారే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను అదే విధంగా కొనసాగించి అందులో ముగ్గురు పార్లమెంట్ సభ్యులను భాగస్వామ్యం చేయడంతో బోర్డును బలోపేతం చేసినట్లైంది. ఈ చర్యల వల్ల బోర్డు లక్ష్యం దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వాణిజ్య పంట అయిన పొగాకును ఉమ్మడి గుంటూరు ప్రకాశం, క్రిష్ణా జిల్లాలతోపాటు తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. స్థానిక రైతులకు మేలు జరిగేలా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సత్ఫలితాలిస్తోందో వేచిచూడాలి.

Tags:    
  • TDP 
  • PuttaMaheshKumar 
  • TobaccoBoard 
  • GunturTobacco 
  • PoliticalAppointments 
  • YanamalaRamakrishna 
  • BJP 
  • TelanganaMPs 
  • FarmersWelfare 
  • TobaccoCultivation 
  • GovtReforms 
  • Centralauthorities 
  • TobaccoBoardRevamp 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS