• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పేర్ని నాని సతీమణిపై...

పేర్ని నాని సతీమణిపై కేసు... గోడౌన్ లో టన్నుల బియ్యం మాయం!!

| ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రేషన్ బియ్యం సరఫరాలో అవకతవకలు.. పీడీఎఫ్ బియ్యం విదేశాలకు తరలింపు వంటి అంశాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2024-12-11 10:13 GMT

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రేషన్ బియ్యం సరఫరాలో అవకతవకలు.. పీడీఎఫ్ బియ్యం విదేశాలకు తరలింపు వంటి అంశాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది.

అవును... పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. సుమారు 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్లు కోటిరెడ్డి గుర్తించారని అంటున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని.. తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోడౌన్ నిర్మించి.. దాన్ని సివిల్ సప్లయిస్ కు బఫర్ గోడౌన్ గా అద్దెకు ఇచ్చారని అంటున్నారు. ఈ సమయంలో గత పది రోజుల వార్షిక తనిఖీల్లో భాగంగా ఆ గోడౌన్ ను అధికారులు తనిఖీ చేశారని అంటున్నారు.

ఇలా సివిల్ సప్లయిస్ అధికారులు జరిపిన తనిఖీల్లో సుమారు 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మామైనట్లు తేల్చారని తెలుస్తోంది. దీంతో... పౌరసఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి.. పేర్ని జయసుధపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైనట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు చేశారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో స్పందించిన పేర్ని జయసుధ... వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్లే షార్టేజీ వచ్చిందని అధికారులకు లేఖ రాశారని అంటున్నారు. ఈ క్రమంలో వచ్చిన షార్టేజీకి సంబంధించిన విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది. అయితే... ఈ లేఖపై అధికారులు స్పందించాల్సి ఉందని అంటున్నారు!

Tags:    
  • Perninani 
  • Pernijayasudha 
  • Godown 
  • Andhrapradesh 
  • Rationrice 
  • Rationricesmuggling 
  • PDSRice 
  • Formerminister 
  • YCP 
  • Alliancegovernment 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS