• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బైరెడ్డి చిన్నపిల్లోడు......

బైరెడ్డి చిన్నపిల్లోడు... శ్రీరెడ్డి వీడియో వైరల్!

| ఇందులో భాగంగా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

By - Tupaki Desk
Update: 2024-06-23 06:33 GMT

సోషల్ మీడియాలో హల్ చల్ చేసే కొన్ని పోస్టులు మీమ్స్ అని తెలిసినా.. ఎవరినైతే లక్ష్యంగా చేసుకున్నారో వారిని మాత్రం ఇవి బలంగా కలిదిస్తుంటాయి. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఒక ఆసక్తికర విషయం తీవ్ర వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా... వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో శ్రీరెడ్డి వివాహం అంటూ సోషల్ మీడియాలో ఒక (ఫేక్)ప్రచారం ఊపందుకుంది.

నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే భావించాలి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఫస్ట్ టైం ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి! ఈ సందర్భంగా సినిమాలో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు నటులు, నిర్మాతల కుమారులు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె చేసిన అరోపణలు అప్పట్లో సంచలనంగా మారాయి.

అప్పటి నుంచి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.. ఆమెకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో ఫాలోవర్లు, ఫ్యాన్లూ మిలియన్ సంఖ్యకు చేరిపోయారనే చెప్పాలి. కట్ చేస్తే... శ్రీరెడ్డికి సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ఇది ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రస్తుతం ఈ ప్రచారం మాత్రం వైరల్ గా మారింది. గతంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాన్లీగా ఉంటాడని, అతడంటే తనకు చాలా ఇష్టమని శ్రీరెడ్డి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తాజాగా శ్రీరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో వదిలారు.

ఇందులో భాగంగా... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గురించి, తన గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నారని.. అసలు ఆ అబ్బాయితో తాను ఏ రిలేషన్ షిప్ లోనూ లేనని తెలిపారు. గతంలో బైరెడ్డి బావుంటాడని, అలాంటి మొగుడు వస్తే బాగుంటుందని సరదాగా అన్నట్లు తెలిపారు. వాస్తవానికి తానెప్పుడూ సిద్ధార్థ్ రెడ్డిని చూడటం కానీ, అతనితో ఫోన్ లో మాట్లాడటం కానీ చేయలేదని తెలిపారు.

అసలు బైరెడ్డి ఎక్కడుంటాడో కూడా తనకు తెలియదని శ్రీరెడ్డి తెలిపారు. ఇక తన గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినా పర్లేదు కానీ.. బైరెడ్డికి ఉన్న మంచి జీవితాన్ని మాత్రం నాశనం చేయకండని ఈ సందర్భంగా ఆమె విన్నవించారు. అతడు చిన్నపిల్లాడని.. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లాడని.. అతని రాజకీయ జీవితం నాశనం చేయొద్దని శ్రీరెడ్డి కోరారు.

Full View
Tags:    
  • Byreddysiddharthreddy 
  • Srireddy 
  • Andhrapradesh 
  • Socailmediaviral 
  • Tollywood 
  • Filmindustry 
  • Castingcouch 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS