బురఖాతో షాప్ కు వెళ్లిన మహిళ.. కట్ చేస్తే.. షాకింగ్ నిజం

ఊహకు అందని నేరాలకు నెలువుగా కర్ణాటక మారింది. ఇటీవల కాలంలో పెను సంచలనంగా మారిన పలు నేరాలు వెలుగు చూశాయి.;

Update: 2025-11-21 04:00 GMT

ఊహకు అందని నేరాలకు నెలువుగా కర్ణాటక మారింది. ఇటీవల కాలంలో పెను సంచలనంగా మారిన పలు నేరాలు వెలుగు చూశాయి. మంగళూరు పరిధిలోని బంట్వాళ పట్టణం ఒకటి. నగరం నడిబొడ్డున ఉండే దుస్తుల దుకాణంలో బుధవారం రాత్రి వేళలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గిరాకీ పెద్దగా లేని వేళ.. షాప్ యజమాని లెక్కలు చూసుకుంటున్న వేళ.. బురఖా ధరించిన మహిళ ఒకరు షాప్ లోకి ప్రవేశించారు.

మనిషి ఎవరో తెలీకుండా బురఖా.. ముఖానికి మాస్క్ ఉన్న ఆమె షాప్ లోని వస్త్రాల్ని చూస్తూ తిరుగుతున్నారు. హటాత్తుగా ఆమె లెక్కలు చూసుకుంటున్న యజమానిపై కత్తి దూసింది. ఇష్టానుసారం కత్తితో పొడిచిన ఆమె.. ఆ వెంటనే అక్కడి నుంచి పరారీ అయ్యింది. అయితే.. షాప్ లోని వారు.. బాధితుడైన షాప్ యజమాని కేకలతో అక్కడున్న వారు అప్రమత్తమయ్యారు. బాధితుడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలిస్తూనే.. మరోవైపు ఇంకొందరు పరుగులు తీసిన ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఈ షాకింగ్ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బంట్వాళ వీధుల్లో తిరుగుతూ బురఖా ధరించిన మహిళ కోసం వెతకసాగారు. చివరకు ఆమెను పట్టుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి.. బురఖా తీయటంతో అక్కడున్నోళ్లంతా కంగుతినే పరిస్థితి. ఎందుకంటే.. షాప్ యజమానిని కత్తితో పోట్లు పొడిచి పారిపోయింది మరెవరో కాదు.. అతడి భార్యనే.

థ్రిల్లర్ మూవీకి మించిన ట్విస్టుతో ఉన్న ఈ ఉదంతంతో.. భర్తపై బురఖా ధరించి మరీ ఎందుకు దాడి చేసినట్లు అన్న విషయాన్ని విచారించగా.. కుటుంబంలో పలు వివాదాలు ఉండటంతో ఈ తరహా దాడికి ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. కత్తిపోట్లతో గాయపడిన క్రిష్ణకుమార్ సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లటంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నాడు.

Tags:    

Similar News