మీ మెదడును చురుగ్గా ఉంచుకోవాలనుకుంటున్నారా ?

శరీర ఆరోగ్యం కోసం శారీరక వ్యాయామం ఎంత ముఖ్యమో మెదడును చురుగ్గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-04-29 07:17 GMT

ఒకప్పుడు ఒక పుస్తకమో, దినపత్రికనో, వార పత్రికనో, మాస పత్రికనో, నవలనో చేతికి దొరికితే ఇంటిల్లిపాది వంతుల వారీగా పోటీలు పడి ఎప్పుడు చేతికి వస్తుందా అని ఎదురుచూసి మరీ చదివేవారు. మన జీవితాల్లోకి టీవీలు ఆ తర్వాత చేతుల్లోకి సెల్ ఫోన్లు, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చాక మనిషిని మనిషి పలకరించుకోవడం గగనంగా మారిపోయింది.

శరీర ఆరోగ్యం కోసం శారీరక వ్యాయామం ఎంత ముఖ్యమో మెదడును చురుగ్గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ వచ్చాక అందరూ సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు.

దానిని పక్కన పెట్టి ఆదివారం సంచికల్లో వచ్చే మెదడుకు మేత, పదవినోదంలను పూర్తి చేయడం మీద దృష్టి సారించడంతో పాటు మొబైల్ ఫోన్లలో ఉండే బ్రెయిన్ గేమ్స్ ఆడడం మూలంగా మెదడు ఉత్తేజితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక డాన్స్ వచ్చినవాళ్లు డాన్స్, కుట్లు, అల్లికల ద్వారా కూడా ఏకాగ్రత పెరుగుతుందని చెబుతున్నారు.

మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలని ముత్యాలముగ్గులో రావు గోపాలరావు చెప్పినట్లు మారుతున్న జీవితాలకు అనుగుణంగా మన శరీర, మానసిక ఆరోగ్యానికి వివిధ రకాల వ్యాయామాలు అవసరం అని గుర్తించి మసలుతుంటే మంచిది.

Tags:    

Similar News