టార్గెట్ పెద్దిరెడ్డి:.. దూసుకుపోతున్న బోడే.. !
బోడే రామచంద్ర యాదవ్. భారత చైతన్య యువజన(బీసీవై) పార్టీ అధినేత. యువ నాయకుడు. ప్రజా బంధుగా గుర్తింపు తెచ్చుకున్నారు.;
బోడే రామచంద్ర యాదవ్. భారత చైతన్య యువజన(బీసీవై) పార్టీ అధినేత. యువ నాయకుడు. ప్రజా బంధుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో విజయం లక్ష్యంగా గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న బోడే ఇప్పుడు.. మరింత దూకుడు పెంచారు. తాజాగా ఆయన పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి, అక్రమాలపై పుస్తకం రూపొందిస్తున్న బీసీవై నాయకులు చెబుతున్నారు. వీటిని రెండు సంపుటాలుగా తీసుకువస్తున్నట్టు తెలిపారు.
వచ్చే ఎన్నికల నాటికి వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అవినీతిలో ఎలా కూరుకు పోయిందో వివరించాలన్నది బోడే ప్రయత్నం. ఇక, ఇప్పటికే అటవీ భూములు ఆక్రమించారని.. మద్యం కుంభకోణంలోనూ పేరు ఉందని.. అలానే.. స్థానికంగా భూముల ఆక్రమణలు కూడా ఉన్నాయని బోడే చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఇటీవల పలు కేసులు నమోదు చేసింది. ఈ పరిణామాలకు తోడు.. పెద్దిరెడ్డిపై నియోజకవర్గంలోని రెడ్లలో చీలిక వచ్చిందన్న వాదన కూడా ఉంది.
ఈ మొత్తం పరిణామాలపై దృష్టి పెట్టిన బోడే రామచంద్రయాదవ్.. వీటిని తమకు అనుకూలంగా మలు చుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రధానంగా పుంగనూరులో విజయం దక్కించుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది ఆయన వాదనగా ఉంది. క్షేత్రస్థాయిలో యువత, రైతు లు.. బోడేకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఎక్కడ ఎప్పుడు పిలుపునిచ్చినా వారు వేలాదిగా తరలి వస్తున్నారు. అంతేకాదు.. కుర్రేడు రైతులు అయితే.. ఆయనను చేయి పట్టుకుని ముందుకు నడిపించారు.
ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో వాటిపై ఇప్పుడు బోడే దృ ష్టి పెట్టారని తెలిసింది. ఈ క్రమంలోనే మేధావులను కదిలించేలా.. పుస్తకాలు.. కార్యక్రమాలను రూపొంది స్తున్నారు. అదేసమయంలో బాధితులు ఎవరైనా ఎక్కడున్నా.. ఆదుకునేందుకురెడీగా ఉన్నారు. ఇలా.. పెద్దిరెడ్డి ఇలాకాలో బోడే నిరంతరం కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించడం గమనార్హం.