బ్రిజ్ భూషణ్ కు బీజేపీ టికెట్ రాదా?

ఉత్తరప్రదేశ్ లో వివాదాస్పద ఎంపీల్లో బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఒకరు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా కూడా సుపరిచితుడే.

Update: 2024-05-02 10:02 GMT

ఉత్తరప్రదేశ్ లో వివాదాస్పద ఎంపీల్లో బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఒకరు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా కూడా సుపరిచితుడే. ఆయనపై రెండేళ్లుగా రెజ్లర్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు. పలుమార్లు విచారణలు కూడా కొనసాగాయి. తాజాగా ఆయనను సమాఖ్య నుంచి తొలగించాలని డిమాండ్లు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అతడికి ఎంపీ టికెట్ నిరాకరిస్తున్నారనే వాదన కొనసాగుతోంది.

అతడి కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కు టికెట్ ఇచ్చేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. బ్రిజ్ భూషణ్ టికెట్ తీసుకొచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే 20న కైసర్ గంజ్ లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ నామినేషన్ దాఖలుకు తుది గడువు రేపటితో ముగుస్తుంది. నేడు అభ్యర్థిని ప్రకటించే చాన్సు ఉందని అంటున్నారు.

జాతీయ రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉండటంతో బ్రిజ్ భూషణ్ రెండేళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. గతేడాది రెజ్లింగ్ నుంచి వైదొలిగారు. అతడి స్థానంలో సన్నిహితుడైన సంజయ్ సింగ్ ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో మంచి పేరున్న నేతల్లో ఒకరైన బ్రిజ్ భూషణ్ ఎంపీగా ఆరుసార్లు ఎంపీగా గెలిచారంటే అతిశయోక్తి కాదు.

ఇన్ని రకాల కేసులున్నా పలు రాజ్యాంగ పదవులు నిర్వహించాడు. భారీ ఎత్తున యువతకు క్రీడల్లో స్ఫూర్తిని నింపాడు. వారికి పాపులారిటీ తీసుకొచ్చాడు. దాదాపు ఆరు జిల్లాల్లో అతడి హవా కొనసాగుతుంది. బీజేపీ బ్రిజ్ భూషణ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. కానీ అతడి కుటుంబంలోనే టికెట్ ఉంటుందని భావిస్తున్నారు.

బ్రిజ్ భూషణ్ జీవితమే ఓ వివాదాల పుట్ట. అతడిపై కేసులు కూడా బాగానే ఉన్నాయి. ఈనేపథ్యంలో అతడి రాజకీయ భవితవ్యం గురించి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. ఇన్నాళ్లు పార్టీ నీడనే బతికిన అతడికి టికెట్ ఇస్తుందా? లేక పక్కన పెడుతుందా? అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి అతడి ప్రస్థానంపైనే అనుమానాలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News