దక్షిణాదిన బీజేపీ పాచికలు పారవు

అయితే కాషాయదళం ఆశలు నిజం కావని, దక్షిణాదిన బీజేపీకి స్థానం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు.

Update: 2024-04-19 10:30 GMT

లోక్ సభ ఎన్నికల సమరం తారాస్థాయికి చేరింది. హ్యాట్రిక్ విజయం మీద కన్నేసిన కాషాయదళం ఈ సారి దక్షిణాదిన అత్యధిక స్థానాలు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కర్ణాటక, తెలంగాణ, ఏపీలలో గణనీయంగా సీట్లు సాధించాలని, తమిళనాడు, కేరళలో ఖాతా తెరవాలన్న తలంపుతో బీజేపీ ఉన్నది. ఈ మేరకు ప్రధానమంత్రి మోడీ పలుమార్లు పర్యటించి పలు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశాడు.

అయితే కాషాయదళం ఆశలు నిజం కావని, దక్షిణాదిన బీజేపీకి స్థానం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేరళ పర్యటనలో ఓ మీడియాతో మాట్లాడిన రేవంత్ ‘‘దక్షిణాదిన 130 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 115 నుండి 120 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంటుంది. 12 నుండి 15 స్థానాలు మాత్రమే బీజేపీకి వస్తాయి. తెలంగాణలో 17కు 14 స్థానాలు, కేరళలో మొత్తం 20 స్థానాలు ఇండియా కూటమి గెలుస్తుందని రేవంత్ జోస్యం చెప్పాడు.

అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదంతో మిషన్ సౌత్ ప్రకటించిన బీజేపీ కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరిలలో అత్యధిక స్థానాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నది. గత ఎన్నికలలో తెలంగాణలో మాత్రమే బీజేపీ నాలుగు స్థానాలు సాధించగలిగింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఘోర పరాజయం మూటగట్టుకున్నది. కేవలం రామమందిరం అంశాన్ని ప్రధానంగా చేసుకుని ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నంలో ఆ పార్టీ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ సారి దక్షిణాదిన బీజేపీ ప్రదర్శన ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Tags:    

Similar News