దళపతి విజయ్ కి తలుపులు తెరచిన ఎన్డీయే

తాజాగా ఒక ప్రంతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ తమిళనాడు పొలిటికల్ సినారియో గురించి వివరించారు.;

Update: 2025-06-28 03:44 GMT

ఎన్డీయేలో గొప్పతనం అదే పుష్కప విమానం లాంటిది ఎన్డీయే . ఎందరు వచ్చినా చేర్చుకుంటారు. ఇక తాము టార్గెట్ చేసే రాష్ట్రాలలో అయితే కీలక పార్టీలను కలుపుకుపోవాలని చూస్తారు. బీజేపీ చూపు తమిళనాడు ఎన్నికల మీద ఉంది.

అక్కడ డీఎంకేని ఎలాగైనా గద్దె దించాలని చూస్తోంది. డీఎంకే ఇండియా కూటమికి ఆక్సిజన్ అందిస్తోంది. అంతే కాదు సౌత్ ఇండియాలో బలంగా ఉంది. మరో వైపు చూస్తే రేపటి ఎన్నికల్లో కనుక డీఎంకే గెలిస్తే కాంగ్రెస్ కి ఇండియా కూటమికి అది కొండంత బలంగా జాతీయ స్థాయిలో మారుతుంది. 2029 ఎన్నికల్లో కూడా టఫ్ ఫైట్ కి ఆస్కారం ఉంటుంది.

అందుకే ఆదికి ముందే డీఎంకేని ఓడిచేఅయలని బీజేపీ పధక రచన చేస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే పావులు చకచకా కదుపుతోంది. అన్నా డీఎంకేని తమ మిత్రుడిగా చేసుకున్న బీజేపీ గ్లామర్ పుష్కలంగా ఉన్న పవన్ కళ్యాణ్ ని తమిళనాడులో రంగంలోకి దించుతోంది.

ఈ నేపధ్యంలో తమిళనాడుని గెలుచుకునేందుకు బీజేపీ ఆలోచనలు ఏమిటి అన్న దాని మీద కేంద్ర హోం మంత్రి బీజేపీ పెద్ద అయిన అమిత్ షా సూచనప్రాయంగా సంకేతాలు ఇచ్చారు అని అంటున్నారు. తమిళనాడులో అధికార డీఎంకేని ఓడించడానికి మరింత బలం కూడగట్టుకోవడానికి దళపతి తమిళ సూపర్ స్టార్ విజయ్ పార్టీ వైపు చూస్తోంది అని అంటున్నారు

తాజాగా ఒక ప్రంతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ తమిళనాడు పొలిటికల్ సినారియో గురించి వివరించారు. తన మనసులో ఉన్న భావాలను ఎన్నికలలో బీజేపీ పాత్రను గెలిచే విధంగా ఆ పార్టీ చేస్తున్న కసరత్తుని విడమరచి చెప్పారు. తమిళనాడులో తదుపరి ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అభ్యర్థి ఉంటారు అని స్పష్టంగా చెప్పారు. అంతే కాదు తమిళనాడులో ఎన్డీయే కూటమి గెలవబోతోంది అని గట్టి విశ్వాసం ప్రకటించారు.

ఇక తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన దళపతి విజయ్ కి చెందిన టీవీకే పార్టీ ఎండీఎయే చేరే విషయం గురించి ఆయన స్పందిస్తూ ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నయని అన్నారు. అంటే ఆప్షన్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పకనే చెప్పారు అన్న మాట. విజయ్ పార్టీని ఎన్డీయేలో చేర్చుకొవడానికి బీజేపీ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ సాగుతోంది.

ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా అన్న దాంటో ఎవరికి తోచిన అర్ధాలు వారు వెతుక్కుంటున్నారు. ఎన్నికల సమయానికి కచ్చితంగా విజయ్ పార్టీ ఎన్డీయేలో చేరుతుందని అంటున్న వారూ ఉన్నారు. ఇక తమిళనాడు ఎన్నికలు జాతీయ స్థాయిలో విశేషంగా ప్రభావితం చేస్తాయన్న ఆలోచన బీజేపీకి ఉన్నందు వల్ల కచ్చితంగా బీజేపీ తమిళనాడులో రాజకీయ సన్నివేశాలు తనకు అనుకూలంగా మార్చుకోవడానికే చూస్తుందని అంటున్నారు.

మరి బీజేపీ వ్య్హూహాలు ఆలోచనలు ఫలిస్తే కనుక తమిళ రాజకీయం రసకందాయంలో పడుతుంది. ఇంతకీ విజయ్ పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో చేరుతుందా అన్నది అతి పెద్ద ప్రశ్న. జవాబు అయితే ఇపుడే దొరకదు. కానీ విజయ్ కోసం ఎండీయే తలుపులు తెరచి ఉంచినట్లుగా బీజేపీ చెప్పకనే చెప్పింది అని అంటున్నారు. ఇక పోతే 2026లో తమిళనాడులో ఎన్నికలు జరుగుతాయి.అంటే గట్టిగా ఏడాది సమయం కూడా లేదు అని అంటున్నారు.

Tags:    

Similar News