కాంగ్రెస్ పునరుజ్జీవంపైన వైసీపీ సీనియర్ల ఆశలు ?
ఇక బీహార్ లో కూడా యాంటీ ఇంకెంబెన్సీ బలంగా పనిచేసే చాన్స్ ఉంది అని అంటున్నారు. రీసెంట్ గా ఈఎస్ ఎస్ పేరుతో ఒక సర్వే అక్కడ వచ్చింది.;
దేశంలో రాజకీయం మారుతోంది అన్నది ఒక సంకేతంగా కనిపిస్తొంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఎ కూటమి వర్సెస్ ఇండియా కూటమిగా పోటాపోటీ జరిగినా విజయం ఎన్డీయేను వరించినా ఇండియా కూటమి పట్టుదల అయితే ఇక్కడ కనిపించింది. ఆ వేడి వాడి కూడా అందరికీ అర్ధం అయింది. ఇక రాహుల్ గాంధీ బీహార్ లో ఏకంగా పదిహేను రోజుల పాటు చేసిన ఓటర్ అధికార యాత్రకు మంచి స్పందన లభించింది. మరో వైపు వరసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే పట్ల సహజంగానే యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. అది ఏదో ఒక ఎన్నికల రూపంలో బయటపడితే చాలు ఆ వేవ్ అలా కొనసాగుతుందని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.
బీహార్ ఫలితాల మీద :
ఇక బీహార్ లో కూడా యాంటీ ఇంకెంబెన్సీ బలంగా పనిచేసే చాన్స్ ఉంది అని అంటున్నారు. రీసెంట్ గా ఈఎస్ ఎస్ పేరుతో ఒక సర్వే అక్కడ వచ్చింది. దాని ప్రకారం చూస్తే కనుక అక్కడ ఇండియా కూటమి కంఫర్టబుల్ మెజారిటీతో అధికారం హస్తగతం చేసుకుంటుంది అని తేలింది. ఈ ఎస్ ఎస్ సర్వే ప్రతీ నెలా చేస్తునారు. ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 10 దాకా చేసిన ఈ సర్వే ఫలితాలు చూస్తే ఎన్డీయేకు 80 దాకా మాత్రమే సీట్లు వస్తాయని ఇండియా కూటమికి 140 దాకా సీట్లు వస్తాయని తేల్చారు. మొత్తం 243 సీట్లు ఉండే బీహార్ అసెంబ్లీలో ఇండియా కూటమి ప్రభుత్వం ఈసారి వస్తుందని ఈ సర్వే చెబుతోంది.
రీజన్లు ఇవేనా :
ఈసారి బీహార్ లో ఓబీసీలు ముస్లిం మైనారిటీలు కీలక పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. కుల గణన పేరుతో కాంగ్రెస్ సాగించిన పోరాటం ఫలిస్తోంది అని అంటున్నారు. నూటికి తొంబై శాతం మంది ఓబీసీలు ఇండియా కూటమి వైపే ఉన్నారని అంటున్నారు. అలాగే ముస్లింలు ఈసారి ఇండియా కూటమి వైపే ఉంటారని అంటున్నారు. మజ్లీస్ ఇక్కడ పోటీలో ఉన్నా ఓట్ల చీలిక పెద్దగా ఉండే చాన్స్ లేదని అంటున్నారు. అదే సమయంలో 19 శాతం ఉన్న దళితులలో ఎక్కువ శాతం ఎండీయే వైపు ఉంటారని ఆ కూటమి ఆశలు పెట్టుకుంటోంది. అలాగే అగ్ర వర్ణాలు ఇతర సామాజిక వర్గాల మీద ఎన్ డీయే ఆధాపడుతోంది.
గెలిస్తే ఏమవుతుంది :
ఇక బీహార్ లో ఇండియా కూటమి గెలిస్తే కనుక జాతీయ స్థాయిలో మార్పులు వస్తాయని అంటున్నారు. అది కేంద్రంలోని ఎన్డీఎ కూటమి మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కనుక ఒక్కసారి పుంజుకుంటే ఆ ప్రభావం గుజరాత్ మీద కూడా ఉంటుందని అంటున్నారు. అక్కడ మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉంది. దాంతో ఈసారి కాంగ్రెస్ రావడానికి చాన్స్ మెరుగు అవుతుంది అని అంటున్నారు. ఇలా కీలక రాష్ట్రలలో మార్పులు మొదలైతే కంక మొదలైతే అది ఏపీ మీద కూడా పడుతుందని అంటున్నారు. ఏపీలో కూటమికి వ్యతిరేకంగా వైసీపీ ఉన్నప్పటికి భావజాలం ప్రకారం చూస్తే బీజేపీకి యాంటీగా ఉండాల్సిన చోట మద్దతుగా నిలుస్తోంది అన్నది కూడా ఉందని అంటున్నారు. యాంటీ ఎన్డీఎ ఫిలాసఫీ కనుక ప్రభావితం చూపితే అది వైసీపీకి ఇబ్బందులు కలుగచేస్తుందని అంటున్నారు.
వేచి చూసే ధోరణిలోనే :
ఇక వైసీపీలో చాలా మంది సీనియర్లు ఎన్నికలు అయిన తరువాత నుంచి మౌన ముద్ర లోనే ఉన్నారు. ఉత్తరాంధ్రా నుంచి చూస్తే గోదావరి జిల్లాలు కోస్తా రాయలసీమలలో చాలా మంది కీలక నాయకులు సైలెంట్ మోడ్ లో ఉన్నారు వారంతా ఆల్టర్ నేషన్ కోసం చూస్తున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ ఎటూ మాతృ సంస్థ కనుక ఒక్కసారి దేశంలో రాజకీయం మారితే మాత్రం వీరిలో కదలిక వస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయని అంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ కూడా బీహార్ ఎన్నికల తరువాత ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడుతుందని అంటున్నారు. ఘర్ వాపసీని ఆ పార్టీ ఒక ఉద్యమంగా ఎత్తుకుంటే ఈసారి ఫలితాలు ఆశాజంకంగానే ఉండొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఏమి జరుగుతుంది అన్నది.