• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బెట్టింగ్ యాప్...

బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు.. సినీ సెలబ్రెటీలక మళ్లీ నోటీసులు?

| ఈ వివాదంలో చిక్కుకున్నవారిలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, శ్రీముఖి, శ్యామల, ప్రణీత, రీతు చౌదరి వంటి ప్రముఖులున్నారు.

By - Tupaki Desk
Update: 2025-07-11 14:34 GMT

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వ్యవహారంలో మరోసారి 29 మంది ప్రముఖులపై విచారణ తిరిగి ప్రారంభం కానుంది. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు మళ్లీ నోటీసులు జారీ చేయాలని సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసు నమోదు అయిన నేపథ్యంలో, ఇప్పుడు ప్రమోషన్లకు సంబంధించిన అగ్రిమెంట్ కాపీలు సమర్పించాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొననుంది.

-కేసులో చిక్కుకున్నవారిలో స్టార్ హీరోలు, యాక్టర్లు, యాక్ట్రెస్‌లు..

ఈ వివాదంలో చిక్కుకున్నవారిలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, శ్రీముఖి, శ్యామల, ప్రణీత, రీతు చౌదరి వంటి ప్రముఖులున్నారు. వీరితో పాటు పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించారు. విచారణకు హాజరు కావాలని వీరికి ఈడీ త్వరలోనే నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.

- బెట్టింగ్ యాప్ యజమానులపై కూడా కేసులు

మొత్తం 19 మంది బెట్టింగ్ యాప్ యజమానులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఏ23, జంగిల్ రమ్మీ, యోలో 247, ఫెయిర్ ప్లే, తెలుగు 365, జీత్ విన్, వి బుక్, తాజ్ 77, మామ 247, జై 365, ఆంధ్ర 365, జెట్ ఎక్స్, పరి మ్యాచ్, ధని బుక్ 365 వంటి యాప్స్ యజమానులు ఉన్నారు. వీరి సంబంధాలు కూడా సెలబ్రిటీలతో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

-సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఫోకస్

ఈడీ నోటీసులు అందుకోబోతున్న ఇన్ఫ్లుయెన్సర్లలో విష్ణుప్రియ, నీతూ అగర్వాల్, సిరి హనుమంతు, వర్షిణి, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, నయనీ పావని, అమృత చౌదరి, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, పండు, టేస్టీ తేజ, సన్నీ యాదవ్, బండారు సుప్రీత ఉన్నారు. వీరు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా యాప్‌లను ప్రమోట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

-ఇక ఎవరైనా తప్పించుకోవడం కష్టమే!

ముందుగా విచారణ జరిగినప్పుడు చాలామంది సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈసారి కేసు మరింత తీవ్రమవుతుందనే ప్రచారం జరుగుతోంది. విచారణకు హాజరుకాకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశముంది.

మొత్తానికి... సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యూను ఉపయోగించుకుంటూ, బెట్టింగ్ యాప్స్‌కు మద్దతిచ్చిన వారికి ఇప్పుడు చుక్కలు చూపించేలా ఉన్నాయి ఈడీ నోటీసులు అని విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
  • BettingApps 
  • EDInvestigation 
  • CelebrityControversy 
  • MoneyLaundering 
  • TollywoodNews 
  • SocialMediaInfluencers 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS