సీఎంకు షాకిచ్చిన విప్రో ఛైర్మన్.. కీలక సూచనలు!

అవును... కర్నాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ప్రధానంగా వర్షాకాలం కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు రొటీన్ గా మారి, నరకం చూపిస్తున్నాయి.;

Update: 2025-09-26 06:13 GMT

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ట్రాఫిక్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక వర్షాకాలం వచ్చిందంటే డబుల్ ఇంపేక్ట్! ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ సమస్యకు ఓ తాత్కాలిక ఆలోచన చేసింది. అయితే అందుకు విప్రో ఛైర్మన్ సున్నితంగా నో చెప్పి షాకిచ్చారు!

అవును... కర్నాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ప్రధానంగా వర్షాకాలం కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు రొటీన్ గా మారి, నరకం చూపిస్తున్నాయి. దీంతో రోడ్ల మరమ్మత్తుల్ని నెల రోజుల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆలోపు ఓ ఆలోచన చేసింది.

ఇందులో భాగంగా.. ట్రాఫిక్ రద్దీ తగ్గించడం కోసం విప్రో క్యాంపస్ లో నుంచి వాహనాల్ని అనుమతించాలని ఆ సంస్ధను కోరింది. ఈ మేరకు విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్ జీకి సీఎం సిద్దరామయ్య లేఖ రాశారు. అయితే.. దాన్ని అజీమ్ ప్రేమ్ జీ సున్నితంగా తిరస్కరించారు. బయటి వాహనాల్ని తమ క్యాంపస్ గుండా ప్రయాణించేందుకు అంగీకరించలేదు.

ఈ క్రమంలో... బెంగళూరులో ట్రాపిక్ సమస్య తీవ్రతను తాము గుర్తిస్తున్నట్లు అంగీకరించిన ప్రేమ్ జీ.. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కార్పొరేట్ మద్దతు కోసం సిద్ధరామయ్య చేసిన విజ్ఞప్తిని ప్రశంసించారు. అయితే సర్జాపూర్‌ లోని క్యాంపస్‌ ను ప్రత్యేక ఆర్థిక జోన్ గా ఏర్పాటు చేశారని, కఠినమైన యాక్సెస్ నియంత్రణ నియమాలకు కట్టుబడి ఉన్నట్లు గుర్తుచేశారు.

ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా... ప్రైవేట్ ఆస్తి ద్వారా ప్రజా వాహనాల కదలిక స్థిరమైన, దీర్ఘకాలిక పరిష్కారంగా ప్రభావవంతంగా ఏమాత్రం ఉండదని తేల్చి చెప్పిన విప్రో ఛైర్మన్.. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి దీర్ఘకాలిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రీయ, నిపుణుల నేతృత్వంలోని అధ్యయనం అవసరమని సూచించారు.

ఈ క్రమంలో.. నిర్దిష్ట అభ్యర్థనను తిరస్కరించినప్పటికీ.. సవాళ్లపై ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడానికి విప్రో సిద్దంగా ఉన్నట్లు ఆయన సీఎం సిద్దరామయ్యకు తెలిపారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర అధికారులతో తదుపరి చర్చలను సమన్వయం చేయడానికి కంపెనీ సీనియర్ ప్రతినిధి రేష్మి శంకర్‌ ను నియమించారు. దీంతో.. కర్ణాటక సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News