స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌తో నెలకు రూ.31 లక్షలు... ఐటీ ఉద్యోగం అవసరమా?
ఉద్యోగం చేస్తే నెల నెల వచ్చే జీతంతో జీవితం సంతోషంగా సాగించవచ్చు అనుకునే వారు చాలా మంది ఉంటారు.;
ఉద్యోగం చేస్తే నెల నెల వచ్చే జీతంతో జీవితం సంతోషంగా సాగించవచ్చు అనుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ కొందరు మాత్రం ఉద్యోగం బోరింగ్, వచ్చే జీతంకు లోబడి జీవించాల్సి ఉంటుంది, కనుక సొంత వ్యాపారం చేయాలి అనుకునే వారు కొద్ది మంది ఉంటారు. ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసే వారు కొందరు ఉంటే, ఉద్యోగం పూర్తిగా మానేసి ఏదో ఒక వ్యాపారం మొదలు పెట్టే వారు కొందరు ఉంటారు. అయితే వ్యాపారం అనేది ఒక జూదం వంటిది. కచ్చితంగా సక్సెస్ కాగలరు అనే నమ్మకం ఉండదు. అందుకే చాలా మంది బిజినెస్ అంటే భయపడుతూ ఉంటారు. కొందరి అనుభవాలను చెబుతూ అవసరమా అని మాట్లాడే వారు ఉంటారు. కానీ కొందరు మాత్రం అనుభవం మనం కూడా చూద్దా, ఏది అయితే అది అయింది అనుకుని ముందుకు సాగే వారు కొందరు ఉంటారు. చిరు వ్యాపారం పెట్టి సక్సెస్ అయిన వారి గురించి ఉద్యోగం చేసుకునే వారు మాట్లాడుకోవడం ఈ మధ్య కామన్ అయింది.
మోమోస్ అమ్మి కోట్లు సంపాదిస్తున్న వ్యాపారి...
ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక మోమో ఫుడ్ వ్యాపారి పై సోషల్ మీడియా వ్యక్తి చేసిన వీడియో వైరల్ అయింది. సాధారణంగా అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. స్ట్రీట్ ఫుడ్ స్టాల్ పెట్టి రోజుకు వందలు, వేల రూపాయలు సంపాదిస్తున్నారు అనే వార్తలు మనం చూస్తున్నాం. కానీ బెంగళూరుకు చెందిన ఆ మోమోస్ వ్యాపారి రోజుకు ఏకంగా 950 ప్లేట్ల మోమోస్‌ను విక్రయించడం ద్వారా అతి పెద్ద వ్యాపారంను క్రియేట్ చేసుకున్నాడు. స్థానికంగా తనకు ఉన్న మంచి పేరు, తన రెసిపీకి ఉన్న మంచి పేరు కారణంగా అత్యధికులు తన మోమోస్ వైపు ఆకర్షితం అయ్యారు. దాంతో అతడి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. అతడి యొక్క సంపాదన గురించి చెప్పడం ద్వారా ఒక్కసారిగా ఆ వ్యాపారి గురించి జాతీయ మీడియాలో చర్చ మొదలైంది.
బెంగళూరులో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్...
ఆ వ్యాపారం రోజులో ఆఫ్ లైన్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా 950 ప్లేట్ల మోమోస్ ను అమ్మడం ద్వారా వచ్చే ఆధాయం అందరినీ సర్‌ప్రైజ్‌కి గురి చేస్తుంది. ఒక్క ప్లేట్‌కి అతడు ఇతర వ్యాపారులు తీసుకున్నట్లుగానే రూ.100 నుంచి రూ.110లు తీసుకుంటూ ఉంటాడు. అతడి వ్యాపారం కేవలం ఆరు గంటలు మాత్రమే సాగుతుంది. సాయంత్రం 4 గంటలకు అతడు తన స్టాల్ ను ఓపెన్ చేస్తాడు. కస్టమర్స్ రావడం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దాదాపుగా నాలుగు గంటల పాటు అత్యంత రద్దీగా మోమోస్ స్టాల్ రన్ అవుతుంది. ఆ సమయంలో అతడి టీం మెంబర్స్ క్షణం తీరిక లేకుండా ఉంటారు. నాలుగు గంటల్లో వారు సరాసరిగా 950 మోమో ప్లేట్స్ అమ్మేస్తూ ఉంటారు. తద్వారా రోజులోనే వారు రూ.లక్ష కు పైగా సంపాదిస్తారు. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగులు...
గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేసే వారు సైతం ఆ స్థాయిలో సంపాదించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఆ కంపెనీల్లో ఉద్యోగుల సగటు జీతం రూ.60 వేల నుంచి రూ.75 వేలు ఉంటుంది. కానీ ఇతడు కేవలం నాలుగు, అయిదు గంటలు రోజులో కష్టపడి నెలకు ఏకంగా 31 లక్షలు, అంతకు మించి సంపాధిస్తున్నాడు. పెద్ద కంపెనీల్లోనూ ఏడాదికి జీతం కోటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది. అది కూడా అత్యంత సీనియర్‌కి, అత్యంత ప్రతిభావంతులకు. కానీ ఇతడు స్టాల్ నిర్వహించడం ద్వారా ఈ స్థాయిలో సంపాదించడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు, వీడియోలను చూసినప్పుడు చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యోగం మానేసి ఇలాంటి ఫుడ్ స్టాల్ లేదా ఏదైనా చిరు వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. మరి మీరు ఏం అనుకుంటారు.