జైల్లో మందు, పల్లీలు... డ్యాన్సుల వీడియోల సంచలనం!

అవును... బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఖైదీలు వీఐపీ సౌకర్యాలు పొందుతున్నట్లు చూపిస్తున్న వీడియో ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-11-10 09:24 GMT

ఇటీవల బెంగళూరులోని ఓ జైల్లో రేపిస్టులు, నేరస్థులు లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని.. వారు సెల్ ఫోన్లు వినియోగిస్తున్నారని.. టీవీ చూస్తున్నారని.. వారి వారి బ్యారక్స్ లో ప్రత్యేకంగా వంట చేసుకుంటున్నారనే ఆరోపణలతో వీడియోలు వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇది అంతకు మించి అనే కామెంట్లను సొంతం చేసుకుంది.

అవును... బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఖైదీలు వీఐపీ సౌకర్యాలు పొందుతున్నట్లు చూపిస్తున్న వీడియో ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. "షాకింగ్... జైలేనా ఈ రేపిస్టు, నేరస్తులకు స్వర్గసీమ..!" అనే శీర్షికతో వచ్చిన కథనం "తుపాకీ.కామ్" పాఠకులకు విధితమే. ఈ క్రమంలో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది.

ఇందులో భాగంగా... తాజాగా అదే జైల్లో ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకొంటున్న మరో వీడియో బయటకు రావడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ వీడియోల్లో జైల్లోని ఖైదీలు పాటలు మందు పార్టీ చేసుకుంటూ, డ్యాన్స్ లు చేస్తూ, పార్టీలు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీంతో... అసలు ఆ జైళ్లలో ఏమి జరుగుతుంది.. అధికారులు ఏమి చేస్తున్నరనే విషయం హాట్ టాపిక్ గా మారింది!

వారం క్రితం తీసిన వీడియోలా ఇవి?:

తాజాగా వైరల్ అవుతోన్న దృశ్యాలలో డిస్పోజబుల్ గ్లాసుల్లో మద్యం, కట్ చేసిన పండ్లు, వేయించిన వేరుశెనగలు కనిపిస్తున్నాయి! పార్టీ కోసం అన్నట్లు జైలు లోపల చక్కటి ఏర్పాట్లు ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు! మరొక వీడియోలో.. నాలుగు చిన్న మద్యం సీసాలు చక్కగా అమర్చబడి ఉండటం కనిపించింది! ఈ క్రమంలో.. కొంతమంది ఖైదీలు డ్యాన్స్ చేస్తూ కనిపించారు! ఈ వీడియోలు వారం క్రితం తీసినట్లు కనిపిస్తోందని తెలుస్తోంది.

సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి వీడియోలు పాతవా?:

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఖైదీలకు వీఐపీ సౌకర్యాలు కల్పించినట్లు చూపిస్తున్న వీడియో ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. అందులో సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి, అనుమానిత ఐసిస్ రిక్రూటర్ జైల్లో ఫోన్లు వాడుతూ, టీవీలు చూస్తున్న దృశ్యాలు కనిపించాయి! అయితే ఆ వీడియో ఇప్పటిది కాదని.. 2023 నాటిదని అధికారులు పేర్కొన్నారు! దీంతో... 2023 అనేది బ్రిటీష్ పాలన కాదుగా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

విచారణ చేపట్టిన అధికారులు!:

బెంగళూరు జైలుకు సంబంధించిన వరుస వీడియోలు వైరల్‌ అవుతోన్న నేపథ్యంలో... కర్ణాటక డైరెక్టర్ జనరల్, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సమయంలో.. మొబైల్ ఫోన్‌ లను ఎవరు లోపలికి తీసుకువచ్చారు.. అవి ఖైదీలకు ఎలా చేరాయి.. మొదలైన విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏది ఏమైనా... ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.


Full View


Tags:    

Similar News