• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బెంగళూరులో రోజుకు నీటి...

బెంగళూరులో రోజుకు నీటి ఖర్చు రూ.500?

| ఈ నీటి కష్టాల్ని ఎదుర్కోలేని వారు పెద్ద సంఖ్యలో బెంగళూరు మహానగరాన్ని వదిలిపెట్టి.. సొంతూర్లకు వెళుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-03-20 04:28 GMT

వాతావరణ పరిస్థితులు ఒకవైపు.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి బెంగళూరు మహానగరంలో బతుకుతున్న లక్షలాది మందికి జీవితం దుర్భరంగా మారింది. తాగునీటి కష్టాలతో వారు విలవిలలాడిపోతున్నారు. గడిచిన కొద్ది నెలలుగా నీటి కష్టాలు ఎక్కువ కావటం.. ఇప్పుడు తీవ్రమైన పరిస్థితి. బెంగళూరు ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలు సినిమా కష్టాలకు మించి ఉంటున్నాయి. పొద్దున్నే లేచింది మొదలు ఆ రోజు అవసరాలకు సరిపడా నీళ్లను సొంతం చేసుకోవటం ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది.

ఈ నీటి కష్టాల్ని ఎదుర్కోలేని వారు పెద్ద సంఖ్యలో బెంగళూరు మహానగరాన్ని వదిలిపెట్టి.. సొంతూర్లకు వెళుతున్నారు. ఉద్యోగాల్ని వర్కు ఫ్రం హోం అడిగి తీసుకుంటున్నారు. ఈ గార్డెన్ సిటీలో ఐటీ ఉద్యోగం చేస్తున్న వారి కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే బెంగళూరులో నీటికి సంబంధించి బోలెడెన్ని రూల్స్ ఇప్పుడు అమలవుతున్నాయి. నీటిని ఏ మాత్రం వేస్టు చేసినా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే నీటి వినియోగంపై పెద్ద ఎత్తున ఆంక్షలు అమలవుతున్నాయి.

నీళ్ల ట్యాంకర్లను బుక్ చేస్తే ఎన్నిరోజులకు వస్తాయో అర్థం కాని పరిస్థితి. ఇలాంటివేళ.. కొన్ని కుటుంబాల వారు రోజుకు రూ.500 ఖర్చు చేస్తే తప్పించి బెంగళూరు నీటి కష్టాలనుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు.. అనేక అపార్టుమెంట్లలో నీటి రేషన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. నీటి కోసం 25 లీటర్ల వాటర్ బాటిళ్లను చేతబట్టిన పలువురు ఆర్ వో కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.

బెంగళూరు నీటి కష్టాల ఎపిసోడ్ లో సిద్దరామయ్య సర్కారుకు భారీ డ్యామేజ్ జరిగిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాగునీటి కొరత అంశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు పూర్తిగా ట్యాంకర్ల మాఫియాకు లొంగిపోయారంటూ రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. నీటి కోసం బెంగళూరు సామాన్యులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. జూన్ వర్షాలు పడే వరకు ఈ తిప్పలు తప్పని పరిస్థితి.

Tags:    
  • Bangalore 
  • Watercrisis 
  • Govrnement 
  • Watercost 
  • Dkshivakumar 
  • Congress 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS