బలూచిస్తాన్ విషయంలో భారత్ వ్యూహం ఇదేనా ?
బలూచిస్తాన్ ఇపుడు పాక్ గుండెల మీద కుంపటి మాదిరిగా ఉంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది.;
బలూచిస్తాన్ ఇపుడు పాక్ గుండెల మీద కుంపటి మాదిరిగా ఉంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది. ఆ దేశం కనుక విడిపోతే పాక్ మరిన్ని ముక్కలు అవుతుంది. అందుకే బలూచిస్తాన్ లో స్వతంత్ర కాంక్షను వేర్పాటు వాద ఉద్యమంగా మార్చి చూపిస్తోంది. దానిని అణచివేస్తోంది పాకిస్తాన్.
అయితే ఏడున్నర దశాబ్దాలుగా సాగుతున్న బలూచిస్తాన్ ఉద్యమం ఇపుడు కొత్త రూపం తీసుకుంది. ఏకంగా వారు తమకొక సొంత జెండా అజెండా తో పాటు అన్నీ ఏర్పాటు చేసుకున్నట్లుగా ప్రకటించేశారు. ఇక అన్ని దౌత్య కార్యాలయాలు అక్కడ పెట్టాలని అన్ని దేశాలను కోరుతున్నారు.
ప్రత్యేకించి భారత్ ని తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని కోరుతున్నారు. అయితే భారత్ బహిరంగంగా బలూచిస్తాన్ కి మద్దతు తెలిపేది ఉండదని అంటున్నారు. ఎందుచేతనంటే అది అంతర్జాతీయ విధానాలకు వ్యతిరేకం. పైగా భారత్ లో కూడా గతంలో వేర్పాటు వాదాలు పుట్టుకొచ్చాయి. దానిని భారత్ సొంతంగానే పరిష్కరించుకుంది. అందువల్ల వేరే దేశంలో దూరి మరీ వివాదాలు చేయడం భారత్ కి ఇష్టం లేదు, అది విధానం కాదు కూడా.
పైగా బలూచిస్తాన్ కి అన్నీ తెగించి మద్దతు ఇస్తే కనుక ఒక స్వతంత్ర దేశంగా మారుతుది. మంచిదే కానీ అది కూడా మరోనాడు బంగ్లాదేశ్ మాదిరిగా మారితే భారత్ కి పక్కలో బల్లెం తప్ప ఉపయోగం ఏముంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 1971లో భారత్ లోని సైనికులు అంతా తమ ప్రాణాలను అర్పించి తూర్పు పాకిస్తాన్ ని విడదీసి బంగ్లాదేశ్ గా మార్చారు. కానీ ఇటీవల కాలంలో చూస్తే ఆ దేశం విషం చిమ్ముతోంది.
ఇపుడు బలూచిస్తాన్ విషయంలో భారత్ ఆలోచనల్ వేరుగా ఉన్నాయి. బలూచిస్తాన్ అలాగే పాక్ ని నానా హింసలు పెట్టాలి. అక్కడ వారి మధ్య అంతర్యుద్ధం సాగుతూనే ఉంటేనే పాక్ ఆ సంస్యలతో సతమతమవుతుది అన్న ఆలోచనలు ఉన్నాయి. భారత్ వరకూ తటస్థ విధానమే మేలు అని ఆలోచిస్తోంది అని అంటున్నారు.
అలా కాకుండా బలూచిస్తాన్ కి మద్దతుగా నిలిచి అటు పాక్ కి ఇటు అంతర్జాతీయ సమాజానికి చెడ్డగా మారి మూటకట్టుకునేది ఏదీ లేదని భావిస్తోంది. మరో వైపు చూస్తే కనుక పాకిస్థాన్ కి ఇంటా బయటా సమస్యలు ఒకేసారి తరుముకుని వచ్చేశాయి.
ఇపుడు పాక్ సైన్యాన్ని బలూచిస్తాన్ కోసం పోరాడే శక్తులే చంపుతున్నాయి. దాంతో పాక్ పూర్తిగా ఇబ్బందులలో ఉంది. ఆ సమస్యను వారే ఎలా పరిష్కరించుకోవాలో తెలియక కిందా మీదా అవుతున్నారు. ఇది ఒక విధంగా పాక్ తలనొప్పి దానిలోకి ఏ విధంగానూ భారత్ దిగరాదు అన్నదే అంతా కోరుతున్నారు. భారత్ సైతం అదే విధానంతో ఉంది అని అంటున్నారు.