క్రాస్ రోడ్ లో బడ్డుకొండ ?

ఇదిలా ఉంటే వైసీపీలో 2015లో చేరిన బడ్డుకొండ అప్పలనాయుడు చేరారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటే ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Update: 2026-10-04 06:30 GMT

విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు రాజకీయం ఎటు అన్న చర్చ సాగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో పదవులు అందుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా అలాగే రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మరో రెండు సార్లు ఆయన ఓటమి చవి చూశారు. దాదాపుగా మూడు దశాబ్దాల రాజకీయ జీవితం చూసిన బడ్డుకొండను వైసీపీ తాజాగా సస్పెండ్ చేసింది. ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి తన బరువుని దించుకున్నారు. అయితే ఇపుడు అప్పలనాయుడు రూట్ ఎటు వైపు అన్న చర్చ సాగుతోంది.

రెండు సార్లు టికెట్ :

ఇదిలా ఉంటే వైసీపీలో 2015లో చేరిన బడ్డుకొండ అప్పలనాయుడు చేరారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటే ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019, 2024లో ఆయనకు రెండు సార్లు వైసీపీ టికెట్ కట్టబెట్టింది. 28 వేల ఓట్లతో 2019లో గెలిచిన ఆయన 38 వేల ఓట్ల భారీ తేడాతో 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. అయితే ఓటమి తరువాత ఆయన కొంత సైలెంట్ అయ్యారు అన్నది వైసీపీ అధినాయకత్వం భావనగా ఉంది. అయితే వెంటనే పోరాటాలు ఎలా చేస్తామని తాజా ప్రెస్ మీట్ లో ఆయన అధిష్టానం వైఖరి మీద నిప్పులు చెరిగారు. అదే సమయంలో తాను జగన్ కంటే ఎక్కువ రాజకీయ అనుభవం కలిగిన నేతగా చెప్పుకున్నారు. దీనిని బట్టి చూస్తే ఆయన వైసీపీ పెద్దల తీరు పట్ల చాలా కాలంగా అసంతృప్తిగానే ఉన్నారు అని అంటున్నారు.

అందుకే వెళ్ళలేదు :

ఇక ఆయనకు చిన్న శ్రీను స్వయాన వియ్యంకుడు అయినా ఆయన వెంట టీడీపీలోకి ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ అకామిడేషన్ లేకపోవడం వల్లనే అని అంటున్నారు. నెల్లిమర్ల టీడీపీలో దిగ్గజ నాయకులు ఉన్నారు. సీనియర్ నేత మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి ఫ్యామిలీ ఉంది. ఆయన మొత్తం ఏడు సార్లు గెలిచారు. ఇక ప్రస్తుతం టీడీపీ ఇంచార్జిగా కర్రోతు బంగారు రాజు ఉన్నారు. ఆయన అన్ని విధాలుగా ధీటైన నేతగా టీడీపీలో కొనసాగుతున్నారు. ఇంకా అనేక మంది నేతలు అయితే టీడీపీకి ఉన్నారు. దాంతో బడ్డుకొండకు నెల్లిమర్ల టీడీపీలో చోటు ఏ మేరకు దక్కుతుందని చర్చ ఉంది. ఈ కారణాల వల్లనే ఆయన వైసీపీని అట్టేబెట్టుకుని ఉన్నారని అంటున్నారు.

జనసేనలో :

నెల్లిమర్ల ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా లోకం మాధవి ఉన్నారు. ఆమె బలమైన మహిళా నాయకురాలిగా ఉండడమే కాదు జనసేన అధినాయకత్వానికి కూడా దగ్గరివారు గా ఉన్నారు. ఇక జనసేనలోనూ నేతలకు ఈ నియోజకవర్గంలో కొదవ లేదు. అయితే ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తే తీసుకుంటారు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. దాంతో బడ్డుకొండ ఏ పార్టీలో చేరుతారు అన్నది చర్చగా ఉంది. కూటమి పార్టీలలో నేతలు ఎక్కువ మంది ఉన్నారని అందుకే ఆయన మీడియా మీట్ లో వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్ కోసమే :

అయితే డీలిమిటేషన్ జరిగితే మరిన్ని సీట్లు పెరుగుతాయని చర్చ ఉ ఉంది. అపుడు కచ్చితంగా సీనియర్ నేతగా బడ్డుకొండకు చాన్స్ ఏదో ఒక పార్టీలో దొరకవచ్చు అని అంటున్నారు. అయితే కూటమి పార్టీలలో జనసేన టీడీపీ పెరిగిన సీట్ల మీద కన్నేసి ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బడ్డుకొండ అప్పలనాయుడుకు వైసీపీనే అన్ని విధాలుగా సూటబుల్ పార్టీ. కానీ అనూహ్యంగా చిన్న శ్రీను తీసుకున్న రాజకీయ నిర్ణయం ఆయన రాజకీయ జీవితం మీద ప్రభావం చూపించింది అని అంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులు సర్పంచులను సొంతంగా నిలబెట్టి బలం నిరూపించుకోవాలని ఆయన చూస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది అని ఆయన భావిస్తున్నారు. ఇక ప్రచారం చూస్తే కనుక టీడీపీలో ఆయన చేరవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News