• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఎం రేవంత్ వర్సెస్...

సీఎం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్.. అసెంబ్లీలో మాటల యుద్ధం..

| ఈ కార్యక్రమంలో పాలకపక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అర్థవంతమైన చర్చ జరిగిందని ఇటు ప్రజలు, అటు పొలిటికల్ అనలసిస్ట్ లు అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2023-12-16 11:30 GMT

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అసెంబ్లీలో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం మాటల యుద్ధాలు వినిపించాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగం తర్వాత ఆమెకు ప్రభుత్వ, ప్రతిపక్షాలు ధన్యవాద తీర్మానం చేశాయి. ఈ కార్యక్రమంలో పాలకపక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అర్థవంతమైన చర్చ జరిగిందని ఇటు ప్రజలు, అటు పొలిటికల్ అనలసిస్ట్ లు అంటున్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలు అర్థవంతమైన చర్చలో పాల్గొనడంతో తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా మారింది. ప్రత్యేక తెలంగాణ సాధనకు కట్టుబడి ఉండడంపై సభలో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వారి వారి వాదనలు నెగ్గించుకునే ప్రయత్నం చేశారు.

ఇన్నాళ్లు బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో సభలో బీఆర్ఎస్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొడుతుంటే.. కాంగ్రెస్ నాయకులు సంయమనంతో మాటల యుద్ధంతో వారిని నిలువరిస్తున్నారు. బీఆర్ఎస్ తో పోలిస్తే తామే బెటర్ అని పాలక బెంచ్ లలో కూర్చున్న కాంగ్రెస్ నేతలు వాదనలు వినిపించారు.

తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆ పార్టీ నాయకులు సమర్ధించడం కామనే. కానీ ప్రతిపక్షానికి సరిగా వాయిస్ ఇచ్చేవారు కాదు. కాంగ్రెస్, బీజేపీకి చెప్పుకోతగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో వారి గొంతు వినిపించకపోవడంతో బీఆర్ఎస్ నిర్ణయాలే పైచేయిగా నిలిచాయి.

ఇప్పుడు సభలో బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని అధికార కాంగ్రెస్ మండిపడగా, అణగారిన వర్గాలపై అణచివేత, నిర్లక్ష్య ధోరణితో నిండిన తెలంగాణలో 'ఇందిరమ్మ రాజ్యం' ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్పుకోవడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుబట్టారు.

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని పాలకవర్గాలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతిపక్షాలతో గౌరవం, తర్కం అంటే ఏమిటో ప్రజలకు అర్థమయ్యే అవకాశం లభించింది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరు పార్టీలు హుందాతనాన్ని పాటించాయని, వ్యక్తి గత ధూషణలకు, అసభ్య పదజాలానికి దిగకుండా సభను అర్థవంతమైన చర్యతో ప్రారంభించి కొనసాగించాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.

Tags:    
  • Telangana 
  • Politicalnews 
  • Congress 
  • Brs 
  • Assembly 
  • Revanthreddy 
  • Ktr 
  • Opposition 
  • Governor 
  • Speaker 
  • Tspolitics 

Similar News

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

Copyright @2026

Powered by Blink CMS