తండ్రి హత్యకు 9వ తరగతి కూతురు పథకం..? షాక్ లో స్టేట్..

అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలకు చెందిన ఒక కూతురు తండ్రిని చంపించింది.;

Update: 2025-08-04 06:10 GMT

మానవ సంబంధాలు రోజు రోజుకు మరింత దిగజారుతున్నాయి. విలువలను మరిచిన కుటుంబ సభ్యులు కట్టుకున్నోన్ని, రక్తం పంపినోన్ని హత్య చేయడం, చేయిస్తుండడం చూస్తుంటే.. సమాజం ఎటు పోతోందన్న ఆందోళన కలుగకమానదు. సమస్యలు ఏమైనా కావచ్చు.. ఎన్నైనా ఉండచ్చు.. పరిష్కారం కాకుంటే విడిపోవచ్చు.. ఏ బంధమైనా చావును కోరుకోవడం కరెక్ట్ కాదు. తనకు నచ్చని వ్యక్తిని చంపినా తను సుఖంగా ఉండడం సాధ్యం కాని పనని గుర్తించడం లేదు. కేసులు, జైలు, సమాజం నుంచి చీదరింపులు కలిసి పెరుగుతాయే కానీ తరగవు. కాబట్టి చంపడం దేనికీ పరిష్కారం కాదు.

రోజు రోజుకు కలవరపెడుతున్న మర్డర్లు..

ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకొని ప్రియుడు, తల్లి, తండ్రి, అన్నదమ్ములతో భర్తను చంపుతున్నా, చంపిస్తున్న ఘటనలు దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా విస్తృతమైనప్పటి నుంచి ఎక్కువగా ఫోన్ లో రీల్స్ చూస్తూ అవతలి వ్యక్తికి ఆకర్షితుడై, ఆకర్షితురాలై యువతికి యువకుడు, యువకుడికి యువతి కలిసి హత్యల వరకు వెళ్తున్నారు. హనీమూన్ మర్డర్ దేశంలో సంచలనం అయితే.. సర్వే ఉద్యోగి మర్డర్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇద్దరూ భర్యలు ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు. కుటుంబంలో తగాదాలు ఉండడం కామనే. గతంలో తగాదాలతో భార్యలను హత్య చేసే ఘటనలు ఎక్కువగా జరిగేవి. వాటితో చట్టాలు మారాయి. మహిళా ఫేవర్ గా అనేక చట్టాలు వచ్చాయి. దీంతో చాలా వరకు మహిళలు చట్టాలు, తమకు చుట్టాలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు స్త్రీ అనే సానుభూతి కూడా ఉంటుంది కాబట్టి సమాజం పెద్దగా ఆక్షేపించదు.

కనిపించని రక్త సంబంధాలు..

భార్య, భర్త అనే వారు రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన వారు వారి మధ్య కలహాలు వస్తే చంపుకునే వరకు వెళ్తుండడం బాధాకరమే.. కానీ తల్లి, తండ్రి, కూతురు, కొడుకు ఒకే రక్త సంబంధంగా వచ్చిన వారు. వారి మధ్య కూడా కలహాలు, కోప తాపాలు ఉండడం సహజమే.. కానీ అవి హత్యకు దారి తీయడం మరింత ఘోరమనే చెప్పుకోవాలి. వ్యసనాలతో బానిసైన కొడుకు దారి తప్పి డబ్బు కోసం తల్లిదండ్రులపై దాడులకు దిగడం చూస్తుంటాం. కానీ కూతుళ్లు కూడా ఇదే బాటపట్టడం మరింత కలచివేస్తుంది. తండ్రికి కూతురంటే పంచప్రాణాలు.. అలాంటి తండ్రినే హత్య చేయిస్తున్న కూతుళ్లను నేడు మనం చూస్తున్నాం.. కలి ప్రభావం అని సనాతన వాదులు చెప్తున్నా.. సమాజం మరింత నాశనం అవుతుందని చెప్పచ్చు.

9వ తరగతి మైనర్ హత్య చేయించడం కలిచివేస్తుంది..

అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలకు చెందిన ఒక కూతురు తండ్రిని చంపించింది. ఈ పథకం తాలూకు వివరాలు బయటకు రావడంతో స్థానికులతో పాటు రాష్ట్రం మొత్తం అవాక్కయ్యింది. లాహోవాల్ లోని లహాంగ్ గావ్ కు చెందిన వ్యాపారవేత్త కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతని భార్య, 9వ తరగతి చదువుతున్న అతని కూతురు ఇద్దరు కలిసి అతన్ని చంపేందుకు ప్రణాళిక వేశారు. తల్లితో కలిసి ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లు దిప్జ్యోతి బురగోహైన్, గౌరంగతో ఒప్పందం కుదుర్చుకుంది. దిప్జ్యోతి బురగోహైన్‌తో గగోయ్ కూతురు ప్రేమాయణం నడుపుతుందని దర్యాప్తులో తేలింది. తండ్రిని హత్య చేయించిన తర్వాత దోపిడీ హత్యగా క్రియేట్ చేసేందుకు హంతకులు పన్నాగం పన్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసు ఇప్పుడు అస్సాంలో ఆందోళనను కలిగిస్తోంది.

Tags:    

Similar News