ఏపీ లో సర్ : ఇప్పటికి 26 లక్షల ఓట్లు లేనట్లే !
ఇక ఏపీలో వీవిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు సర్ గడువు పొడిగించాలని రాష్ట్ర ఈసీ కేంద్ర ఈసీని కోరింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియ గత నెల రోజులుగా ఏపీలో సాగుతోంది. ఇప్పటికి చాలా మటుకు పూర్తి అయినా ఇంకా కొంత శాతం ఉంది దాంతో కేంద్ర ఎన్నికల సంఘానికి గడువు పెంచమని కోరుతూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్. లేఖ రాయడం దానికి సానుకూలంగా స్పందించి కేంద్ర ఎన్నికల సంఘం మరో పది రోజుల గడువు పెంచడం జరిగిపోయాయి. దీంతో ఏపీలో సర్ ప్రక్రియ మరింత ముమ్మరం కానుంది. ఇదిలా ఉంటే గత ముప్పయి రోజులుగా ఏపీలో సర్ ప్రక్రియ ద్వారా పెద్ద ఎత్తున కసరత్తు జరిగినట్లుగా అధికారులు తెలిపారు.
ఇప్పటికి భారీగానే :
ఇక ఏపీలో వీవిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు సర్ గడువు పొడిగించాలని రాష్ట్ర ఈసీ కేంద్ర ఈసీని కోరింది. అయితే ఇంకా 12 శాతం మేర ఏపీలో సర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది అని అంటున్నారు. ఇప్పటికి అయితే 88 శాతం దాకా సర్ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ఈసీ వర్గాలు తెలిపాయి. చురుకుగా సర్ కొనసాగుతోందని వివరించారు. ఎక్కడికక్కడ బీఎల్వోలు చురుకుగా పనిచేస్తూ ఓటర్లను కలసి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీతో పాటు పూర్తి చేయించిన వాటిని కూడా డిజిటలైజేషన్ చేయిస్తున్నారు అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
మొత్తం ఓటర్లకు చేరాయి :
ఏపీ వరకూ చూస్తే మొత్తం ఓటర్లు 4 కోట్ల 16 లక్షల 26 వేల 144 మంది ఉన్నారని ఒక లెక్క తేలింది. వీరందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తిగా జరిగింది అని ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇందులో చూస్తే మూడు కోట్ల 69 లక్షల 50 వేల 812 మంది ఓటర్ల డిజిటలైజేషన్ కూడా జూలై 14 నాటికి పూర్తి అయింది అని చెబుతున్నారు. అదే సమయంలో పెండింగ్‌లో 1.67 శాతం ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉన్నాయని అంటున్నారు. ఇవి కూడా తొందరలోనే డిజిటలైజేషన్ జరుగుతాయని అంటున్నారు.
ఈ ఓట్లు లెక్కలో లేవు :
ఏపీలో జరుగుతున్న సర్ ప్రక్రియ ద్వారా తేటతెల్లమైనది ఏంటి అంటే రాష్ట్రంలో ఏకంగా 14 లక్షల 19 వేల 644 మంది ఓటర్లు చనిపోయినట్టుగా ఎన్నికల అధికారులు గుర్తించారు.అన్నది. దాంతో వీరి ఓట్లు ఇక చేర్చినవి ఆటోమెటిక్ గా డిలీట్ అవుతాయని చెబుతున్నారు. అంతే కాదు ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు దేశాలలో ఉద్యోగ వ్యాపార ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిన వారు ఏపీలో ఓటర్ల జాబితాలో ఇక కనిపించరు అని అంటున్నారు. అలా తమకు ఓటు అక్కరలేదు అని కచ్చితంగా చెప్పిన వారి లెక్క కూడా భారీగానే ఉంది. ఇలా పర్మినెంట్‌గా షిఫ్ట్ అయిన ఓటర్లు 12 లక్షల 14 వేల 994 మందిగా ఎన్నికల సంఘం అధికారులు తేల్చారు. అంటే చనిపోయిన ఓట్లు ఇలా షిఫ్ట్ అయిన ఓట్లు కలిపి కూడితే అచ్చంగా 26 లక్షల ఓట్లుగా చెబుతున్నారు. మరో పది రోజుల పాటు ఏపీలో సర్ ప్రక్రియ సాగనుంది. దాంతో మరెంత మంది ఈ జాబితాలోకి వస్తారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా డబుల్ ఓటింగ్ అన్నది సర్ ప్రక్రియతో కట్ అయిందని అలాగే చనిపోయిన వారి ఓట్లు కూడా తీసేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.