టీడీపీ భారం మోయాల్సిందేనా ?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం సాగుతోంది. కూటమి ప్రభుత్వం అంటే అందులో జనసేన బీజేపీ కూడా ఉన్నాయి.;

Update: 2025-10-11 16:34 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం సాగుతోంది. కూటమి ప్రభుత్వం అంటే అందులో జనసేన బీజేపీ కూడా ఉన్నాయి. అయితే కొన్ని కీలక అంశాలలో చూస్తే కనుక టీడీపీనే రియాక్ట్ కావాల్సి వస్తోంది. అఫ్ కోర్స్ వైసీపీ టీడీపీనే టార్గెట్ చేస్తూ వస్తోంది. దాంతో జవాబులు కూడా టీడీపీయే ఇవ్వాలి అన్న భావన అయితే కూటమి మిత్రులకు ఉందా అన్నదే చర్చగా ఉంది. నిజానికి టీడీపీ కూటమిలో పెద్దన్న, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తోంది. కాబట్టి మేజర్ షేర్ టీడీపీదే అవుతుంది, కానీ విపక్షం నుంచి ఘాటైన విమర్శలు వచ్చినపుడు మిత్రుల నుంచి కూడా సహకారం ఉండాలి కదా అన్న చర్చ అయితే వస్తోంది.

వైసీపీ పీపీపీ అంటే :

ఇదిలా ఉంటే వైసీపీ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటూ కూటమి ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతోంది. ఏకంగా జగన్ రంగంలోకి దిగిపోయారు. ఆయన జనంలోకి వచ్చి మరీ సవాల్ చేస్తున్నారు. రోడ్ షో చేస్తూ నర్శీపట్నం దాకా వెళ్ళి వచ్చారు. పీపీపీ విధానం మీద వైసీపీ గట్టిగా పోరాడుతోంది. అయితే దీని మీద టీడీపీ నుంచే రియాక్షన్ వస్తోంది, కౌంటర్లు కూడా టీడీపీనే ఇస్తోంది. సంబంధిత శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు కానీ బీజేపీలో మిగిలిన వారు కానీ అలాగే జనసేన నుంచి కానీ అనుకున్న స్థాయిలో గొంతులు లేవడం లేదు అన్నది గట్టిగానే చర్చ సాగుతోంది.

లిక్కర్ ఫైట్ తో :

ఇక ఏపీలో కల్తీ లిక్కర్ అంటూ వైసీపీ నానా హడావుడి చేస్తోంది. ఏపీలో ఒక చోట కల్తీ మద్యం పట్టుబడింది. దాని మీద టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది. తమ వారు అని కూడా చూడకుండా నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ కేసు మీద సీరియస్ గానే ఉంది. కానీ ఏపీలో ఒక్కర్ స్కాం అంటూ వైసీపీ చేస్తున్న విమర్శల మీద కూడా జనసేన బీజేపీల నుంచి పెద్దగా కౌంటర్లు లేవు అని అంటున్నారు. ఎంతసేపూ టీడీపీ మాత్రమే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఒక విధంగా ఇది ఇబ్బందికరంగానే ఉంది అని అంటున్నారు.

సమిష్టి బాధ్యత కాదా :

కూటమి ప్రభుత్వం అంటే మూడు పార్టీలూ ఉంటాయి. అంతా కలసి అని జనాలు కూడా భావిస్తారు. అలాంటపుడు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం మీద అయినా విపక్షాలు విమర్శలు చేస్తున్నపుడు కూటమి నుంచి కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్లు ఉంటే బాగుంటుంది కదా అన్న చర్చ సాగుతోంది. కానీ కొన్ని కీలక ఇష్యూస్ ఏపీలో బర్నింగ్ టాపిక్స్ గా ఉన్న ఇష్యూస్ విషయంలో మాత్రం ఎందుకో మిత్రులు మౌనం వహిస్తున్నారు అని అంటున్నారు. సరైన సమయంలో ఐక్యంగా ఉండకుండే అవి తప్పుడు సంకేతాలకు దారి తీస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా కూటమి పార్టీలకు ఏనాడో హానీమూన్ ముగిసింది. ఇపుడు వైసీపీ కూడా దూకుడు చేయాలని చూస్తోంది. జనంలో కూడా మెల్లగా చర్చ సాగుతోంది. ఈ కీలకమైన వేళ అంతా కలసి ప్రభుత్వం మీద వచ్చే విమర్శలను తిప్పికొట్టాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News