ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు : సీఎం చంద్రబాబు వెల్లడి
రవాణా రంగంలో దక్షిణాది రాష్ట్రాలకే ఏపీ నెంబర్ వన్ గా నిలవనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.;
రవాణా రంగంలో దక్షిణాది రాష్ట్రాలకే ఏపీ నెంబర్ వన్ గా నిలవనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోలాజిస్టిక్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్లోబల్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ లో నిర్వహించిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై చంద్రబాబు పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించారు.
రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరంతో రోడ్డు, రైలు మార్గాలను అనుంధానిస్తామని, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మించడం ద్వారా సరుకు రవాణాలో ఏపీని అగ్రగామిగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రోడ్లు, రైలు, సముద్రం, ఎయిర్ టాజిస్టిక్స్ పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రోడ్ల అనుసంధానం జరిగినట్లు నదులను కూడా కలపాలి. ఇవాళ ఇళ్లపైనే విద్యుదుత్పత్తి చేసుకుంటున్నాం. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెరిగేలా అనేక చర్యలు చేపట్టాం. ఏఐ క్వాంటం వ్యాలీ పరిధి రోజు రోజుకు పెరుగుతోంది. డ్రోన్లు రోబోటిక్స్, ఐవోటీ, సెన్సార్స్ ను వాడుకుంటున్నాం. ప్రతి రంగంలోనూ స్పష్టమైన సమాచారం ఉంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించినట్లు సీఎం వివరించారు.
వన్ ఫ్యామిలీ, వన్ అంట్రపెన్యూర్ అనేది నా లక్ష్యం. నీటి భద్రత విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. దేశంలో నదుల అనుసంధానం చేపట్టాలని ఎప్పటి నుంచో కోరుతున్నా.. గంగా నుంచి కావేరి వరకు నదులను అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు ఆకాక్షించారు. రాష్ట్రంలో సుదీర్ఘంగా 1053 కి.మీ. తీర ప్రాంతం ఉంది. ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం మనకు పెద్ద ఆస్తి, ప్రస్తుతం బల్క్ రూపంలోనే 90 శాతం కార్గో రవాణా చేస్తున్నాం. ఎయిర్ కార్గో ద్వారా వేగంగా సరుకులు పంపిణీ చేయొచ్చు. రైలు కనెక్టవిటీలో ఏపీ చాలా అనుకూలం. లాజిస్టిక్స్ విషయంలో ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో మన రాష్ట్రానిదే అగ్రస్థానం కావాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 6 పోర్టులు ఉన్నాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. 2047 నాటికి తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఫార్మా, అక్వా ఉత్పత్తుల ఎగుమతిలో మన రాష్ట్రానిదే అగ్రస్థానం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలోనూ వృద్ధి చెందుతున్నాం, మన పోర్టుల అభివృద్ధికి సమజసిద్ధ వనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. షిప్ బిల్డింగ్ విషయంలో మన దేశం చాలా వెనుకబడి ఉంది అని చంద్రబాబు చెప్పారు. ఎయిర్ కార్గో అభివృద్ధి చేయాలని లాజిస్టిక్ సంస్థల ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు.