వైసీపీదే దోపిడీ...ఈడీ రెడీ అంటున్న పయ్యావుల
ఏపీలో అధికార కూటమికి విపక్ష వైసీపీకి మధ్య డైలాగ్ వార్ ఒక రేంజిలో సాగుతోంది.;
ఏపీలో అధికార కూటమికి విపక్ష వైసీపీకి మధ్య డైలాగ్ వార్ ఒక రేంజిలో సాగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా అనేక అంశాల మీద మాట్లాడారు. ఇక ఆయన టీడీపీ కూటమి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి 20 నెలల పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విద్వంశం పెద్ద ఎత్తున జరిగింది అని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. అప్పుల కుప్ప ప్రభుత్వం అని కూడా అన్నారు. ఏపీలో అయిదేళ్ల వైసీపీ పాలన కంటే కూటమి చేసిన అప్పులే అధికం అని జగన్ లెక్కలు చెప్పారు. అయితే దాని మీద కూటమి ఇపుడు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
విద్వంశం అంటే మీదే :
రుణాలు దారుణాలు అన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అసలు మీరు చేసిన ఆర్థిక విద్వంశానికే కదా మేము అప్పుల భారం మోస్తోంది అని కూడా కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం మూడు లక్షల కోట్లు అప్పులు చేసింది అని జగన్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని పయ్యావుల ఖండించారు తాము కచ్చితంగా చేసిన అప్పు 1.05 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని ఆయన వివరించారు
ఆదాయం పెరుగుతోంది :
జగన్ లెక్కలు ఏమొటో ఆయన తీరు ఏంటో తెలియదు కానీ ఏపీ ఆదాయం కూటమి పాలనలోనే బాగా పెరుగుతోంది అని పయ్యావుల తన దగ్గర ఉన్న గణాంకాలతో పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. అలాగే రెవిన్యూ లోటు అయితే ముందు నుంచే ఉందని అన్నారు. అసలు వైసీపీ హాయంలోనే ఆర్థిక విద్వంశం జరిగింది అని కాగ్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. నెట్ బారోయింగ్ ని కూటమి ప్రభుత్వం ఎక్కడా అధిగమించలేదని పయ్యావుల స్పష్టం చేశారు. అప్పులు ఏపీకి ఇవ్వవద్దు అని వంద సంస్థలకు జగన్ లేఖ రాశారు అని కీలక ఆరోపణలు చేశారు పయ్యావుల. జగన్ వైఖరి పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేలా ఉందని ఆయన నిందించారు.
అసెంబ్లీకి రారాదా :
అసలు జగన్ మూడు గంటల ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో అని ఆయన అన్నారు. అంత సమయం మాట్లాడే బదులు జగన్ ఏకంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది కదా అని పయ్యావుల అన్నారు. విపక్షం చేసిన ప్రతీ విమర్శకూ తాము తగిన విధంగా జవాబు చెప్పగలని ఆయన అంటున్న్నారు. అబద్ధాలతో అసత్యాలతో ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.
సంచలన వ్యాఖ్యలు :
ఇక వైసీపీ హయాంలో ఎంత దోపిడి జరిగింది అన్నది లెక్క తీయడానికి ఈడీ రెడీగా ఉందని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ హయాంలో ఆర్ధికంగా చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఈడీ విచారిస్తుంది అన్నది ఆర్ధిక మంత్రి మాటల ద్వారా తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే వైసీపీకి భారీ షాక్ అని అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ మీద అటూ ఇటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇపుడు వ్యవహారం చాలా దూరం వెళ్ళేలా ఉంది. ఈడీ ఫీల్డ్ లోకి దిగుతుంది అంటే మ్యాటర్ వెరీ సీరియస్ అని కూటమి పెద్దలు వైసీపీకి చెప్పకనే గట్టిగా చెబుతున్నారు అని అంటున్నారు. మరి ఈడీ అంటూ పయ్యావుల చేసిన ఈ హాట్ కామెంట్స్ కి వైసీపీ ఎలా స్పందిస్తుంది ఏ విధంగా సిద్ధపడుతుంది అన్నది చూడాల్సి ఉంది.