ఇద్దరి వర్కింగ్ ప్రెసిడెంట్లు... షర్మిల కీలక నిర్ణయం
ఏపీని రెండుగా విభజిస్తూ చేరో భాగాన్ని ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఆమె అప్పగించారు.;
ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరిగింది. పీసీసీ చీఫ్ షర్మిలకు వీరు చేదోడు వాదోడుగా ఉంటారని అధినాయకత్వం నియామకం చేసింది. అయితే షర్మిల అధికారాలకు కత్తెర పడుతోంది అన్న ప్రచారం కూడా సాగింది. ఆమె అసంతృప్తితో ఉన్నారు కూడా అంతటా చర్చ సాగింది. అయితే అనూహ్యంగా షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ రెండుగా చేస్తూ :
ఏపీని రెండుగా విభజిస్తూ చేరో భాగాన్ని ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఆమె అప్పగించారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కి ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా గుంటూరు జిల్లాల పార్టీ బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీకి దక్షిణాంధ్రా జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఆయన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, కడప అనంతపురం జిల్లాలు చూస్తారు అని తెలుస్తోంది. ఈ మేరకు ఒక ప్రకటన పార్టీ తరఫున విడుదల చేశారు.
ఓవరాల్ గా షర్మిల :
ఏపీ మొత్తంగా పార్టీ ప్రచార బాధ్యతలను షర్మిల తీసుకుంటారు అని అంటున్నారు. పార్టీని బలోపేతం చేయడం క్యాడర్ తో సమావేశాలు పార్టీలో నాయకులతో భేటీలు ఇవన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్లు చూసుకుంటారు అని అంటున్నారు. షర్మిల అయితే పార్టీని జనంలోకి తీసుకుని వెళ్ళేలా తన కార్యక్రమాలు రూపొందించుకుంటారు అని అంటున్నారు.
పీఏసీ కీలకంగా :
అయితే ఇక్కడ పీఏసీ కీలకంగా మారనుంది అని అంటున్నారు. పాతిక మందితో ఏర్పాటు అయిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఏపీ కాంగ్రెస్ కి విధాన నిర్ణయ మండలిగా అత్యున్నతంగా ఉండబోతోంది. పీఏసీ నిర్ణయాల మేరకే పీసీసీ పనిచేయబోతుంది అని అంటున్నారు. అంతే కాదు ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ కూడా పీఏసీ సిద్ధం చేస్తుంది అని అంటున్నారు.
జగన్ కాదు వైసీపీ :
షర్మిల ఇప్పటిదాకా జగన్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చారు. దాని వల్ల అది పూర్తిగా వ్యక్తిగత వివాదం అనే కోణంలో జనంలోకి వెళ్ళిపోయింది. పార్టీ పరంగా విమర్శలు చేయాల్సి ఉన్నా జగన్ ప్రస్తావనతో అది వేరేగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా కాంగ్రెస్ ఆలోచన చూస్తే కనుక జగన్ కాదు వైసీపీ అన్నది అర్ధం అవుతోంది అంటున్నారు. జగన్ మీద విమర్శలు చేయాల్సిన చోట చేస్తూనే వైసీపీ నాయకులను తమ వైపు తిప్పుకునేలా లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలని కాంగ్రెస్ చూస్తోంది అని అంటున్నారు. అలా చేస్తేనే తప్ప కాంగ్రెస్ కి పూర్వం వైభవం దక్కదని అంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ ఏపీలో బహుముఖంగా వ్యూహ రచన చేస్తూ సమిష్టి నిర్ణయాలతోనే ముందుకు వెళ్తుంది అని అంటున్నారు.