అమరావతి ..వైసీపీ డైరెక్ట్ అయిపోయిందా ?
ఏపీ రాజధాని విషయంలో వైసీపీలో క్లారిటీ లేదని ప్రత్యర్ధులు విమర్శిస్తారు. కొందరేమో అమరావతి ఘోస్ట్ సిటీ అంటారు.;
ఏపీ రాజధాని విషయంలో వైసీపీలో క్లారిటీ లేదని ప్రత్యర్ధులు విమర్శిస్తారు. కొందరేమో అమరావతి ఘోస్ట్ సిటీ అంటారు. మరి కొందరు అక్కడ రాజధాని తగదు అంటారు, ఇంకొందరు అమరావతికి మేము వ్యతిరేకం కాదని అంటారు. మరి కొందరు మావిగాన్ లో అమరావతి ఉంది కదా అని చెబుతారు. ఇలా అమరావతి విషయంలో వైసీపీకి క్లారిటీ లేదని కూటమి విమర్శలు కురిపిస్తున్న నేపధ్యం ఉంది. అయితే వైసీపీకి అమరావతి విషయంలో ఒక క్లారిటీ ఉందని దానిని వ్యతిరేకించడమే ఆ క్లారిటీ అని ప్రత్యర్ధులు అంటున్నారు మావిగన్ ప్రతిపాదనను జనంలో చర్చకు పెట్టామని దాంతో టీడీపీ ఓర్వలేక తమ మీద విమర్శలు చేస్తోంది అని వైసీపీ అంటోంది అదే సమయంలో అమరావతి మీద మరింత ముందుకెళ్ళి చెప్పాల్సింది చెప్పేస్తోంది.
అప్పుల పాలు అంటూ :
ఏపీని అప్పుల పాలు చేస్తూ దివాళా అంచులకు చేరుస్తూ అమరావతి రాజధానిని బాబు తలకెత్తుకున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఏకంగా గుదిబండ అనేశారు. చంద్రబాబు అనాలోచిత విధానాలతో పాటు అంతులేని అవినీతి చర్యల మూలంగా అలాగే దురాశల కారణంగా అమరావతి ఏపీకి ఎప్పటికీ మోయలేని భారంగా మారుతోంది అని పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో బాబు రాష్ట్రాన్ని దివాళా తీయించే దీగా తీసుకుని వెళ్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
మావిగన్ మీద స్టాండ్ :
మావిగన్ అని జగన్ ఒక కీలకమైన ప్రతిపాదన చేశారు అని దాని మీద కూటమి నేతలు తమ స్టాండ్ ఏమిటో చెప్పకుండా జగన్ మీద విమర్శలు చేస్తున్నారు అని పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగన్ క్యారెక్టర్ ని దెబ్బ తీసేందుకు మీడియా ముందుకు వచ్చి నానా రకాలుగా ఆయన్ని తిట్టించే కార్యక్రమం స్టార్ట్ చేశారు అని పేర్ని నాని ఆరోపించారు. బూతులతో పచ్చి అబద్ధాలతోనే కూటమి జగన్ మీద రాజకీయం చేస్తోంది అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
బాబును ఎన్టీఆర్ తిట్టారు :
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి పేర్ని నాని వెళ్ళారు. ఆనాడు ఏడు పదుల వయసులో ఎన్టీఆర్ చంద్రబాబుని ఎన్ని రకాలుగా తిట్టారో గుర్తు లేదా అని చెప్పుకొచ్చారు బాబుని ఔరంగజేబుతో ఎన్టీఆర్ పోల్చారు అవినీతి పరుడుగా పవన్ కళ్యాణ్ బాబుని గతంలో విమర్శించారని పేర్ని నాని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో ఉన్న మంత్రులలో సగానికి సగం మందిని గతంలో ఆయన్ని తిట్టిన వారేనని పేర్ని నాని అన్నారు. అంతే కాదు 164 మంది కూటమి ఎమ్మెల్యేలలో సగం పైగా బాబుని తిట్టిన వారే అని ఆ లిస్టూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక వారూ వీరూ ఎందుకు బాబుని మోడీ తిట్టలేదా మోడీని బాబు ఎన్ని మాటలు అన్నారని ఆ కధలు చెప్పమంటారా అని పేర్ని నాని టీడీపీ మీద విమర్శలు చేశారు.
రాజకీయం చేయండి :
రాజకీయాలను అలాగే చేస్తే టీడీపీకి మంచిదని పేర్ని నాని అంటున్నారు. తన సొంత తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బాబు మీద రాసిన పుస్తకాలు అయితే బయటే ఉన్నాయని పురంధేశ్వరి బాబుని అన్న మాటలూ అందరికీ ఎరుకే అని అన్నారు. ఇవన్నీ కూడా బయటపెట్టి టీడీపీ రాజకీయ శిక్షణా తరగతులలో కార్యకర్తలకు పంచి పెట్టగలరా అని సవాల్ చేశారు.
మావిగాన్ మీద ప్రచారం :
నిజం చెప్పాలీ అంటే మావిగాన్ మీద విపరీతమైన ప్రచారం చేస్తోంది కూటమి నేతలే అని పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే అది జనంలో చర్చకు వెళ్ళిందని తెలుసుకునే ఇలా చేస్తున్నారు అన్నారు. మావిగాన్ ప్రతిపాదన కంటే అమరావతి ఏ విధంగా బెస్ట్ అని చెప్పకుండా ఈ తిట్ల పురాణం ఎందుకు బాబూ అని ఆయన నిలదీస్తున్నారు.