అన్నదాతకు అక్కడ ముహూర్తం
అన్నదాతా సుఖీభవ అన్నది మంచి పేరు. ఆ పేరుకు సార్ధకత చేసేలా టీడీపీ ప్రభుత్వం అత్యంత ఘనంగా ఈ పధకాన్ని ప్రారంభించబోతున్నది.;
అన్నదాతా సుఖీభవ అన్నది మంచి పేరు. ఆ పేరుకు సార్ధకత చేసేలా టీడీపీ ప్రభుత్వం అత్యంత ఘనంగా ఈ పధకాన్ని ప్రారంభించబోతున్నది. . ఆగస్టు 2వ తేదీన ఈ పధకం అమలు చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా రైతుల ఖాతాలో సాయం మొత్తాన్ని వేయబోతున్నారు. దాంతో టీడీపీ కూటమి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది.
ప్రకాశం జిల్లా నుంచే :
అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2 నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా ఆయన అంటున్నారు.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా ఇచ్చే ఆరు వేల రూపాయల సాయంతో కలిపి రాష్ట్ర వాటాగా మరో 14,000 రూపాయలను ఈ పధకం ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. మొదటి విడతలో రాష్ట్రం వాటా 5,000 రూపాయలు, కేంద్రం వాటా 2,000 రూపాయలు వంతున ఆగస్టు 2న విడుదల కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 46,85, 838 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పధకంతో లబ్ది చేకూరనుందని అన్నారు. ఈ పధకం కోసం 2,342. 92 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అన్న దాతా దీవిస్తారా :
ఆలస్యం అయినా కానీ ఏడు వేల రూపాయలు ఏకంగా ఒక్కో రైతు ఖాతాలో పడబోతున్నాయి. ఖరీఫ్ సీజన్ మధ్యలో ఉంది కాబట్టి ఇది ఎంతో కొంత ఆర్ధికంగా ఆశగా ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం తానే 20 వేల రూపాయలను ఇస్తామని చెప్పి ఇపుడు అందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పధకం మీద పెడుతోంది అన్నది రైతులలో అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు
అందరికీ ఇవ్వాల్సిందే :
అన్న దాత పధకం అందరికీ ఇవ్వాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు 2024లో చూస్తే ఏపీలో 53 లక్షల మంది రైతులు ఉన్నారని కానీ కూటమి లెక్కలు చూస్తే 46 లక్షల మంది రైతులకే ఇస్తున్నారు అని ఆయన అంటున్నారు. అలా కాకుండా మొత్తం అందరికీ ఇస్తేనే కూటమి పెద్దలు మాట నిలబెట్టుకున్నట్లు అని అంటున్నారు. ఏడు లక్షల మందిని లెక్కల నుంచి ఎలా తప్పిస్తారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతులకు కూడా ఈ పధకం అందించాలని ఆయన కోరుతున్నారు అంతే కాదు గత ఏడాది ఇవ్వలేదు కాబట్టి ఆ ఏడాదికి కూడా కలుపుకుని మొత్తం 40 వేల రూపాయలు ఇవ్వాలని కేంద్రంతో ఏ మాత్రం ముడి పెట్టరాదని అంటున్నారు.
ఆ ముద్ర చెరిగిపోయేనా :
బాబు రైతు వ్యతిరేకి అని విపక్షాలూ అంటూ ఉంటాయి. అయితే ఏకంగా వేలాది కోట్ల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాలో వేయడం ద్వారా టీడీపీ వారి పక్షం తాము ఉన్నామని చాటి చెప్పినట్లు అయింది అని అంటున్నారు. పైగా వ్యవసాయం పండుగ చేయడానికే సూపర్ సిక్స్ లో ఈ పధకాన్ని పెట్టారు అని అంటున్నారు. మరి దర్శి వేదికగా చంద్రబాబు ఏ రకమైన ప్రకటన చేస్తారో రైతుల మనసు దోచేలా ఆయన స్పీచ్ ఎలా ఉండబోతోందో చూడాల్సిందే అని అంటున్నారు.