• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్: కేజ్రీవాల్...

బ్రేకింగ్: కేజ్రీవాల్ ఓటమి... అన్నా హజారే షాకింగ్ కామెంట్స్!

| దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుంచి వెలువడుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-02-08 07:00 GMT

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ సమయంలో ఓటింగ్ అనంతరం వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో బీజేపీ ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ (36) దాటగా.. కేజ్రీవాల్ ఓటమి పాలవ్వడం గమనార్హం.

న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యరు. ఇక్కడ 9వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి సమీప భారతీయ జనతాపార్టీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ 1,200 ఓట్ల ముందంజలో ఉండగా.. ఫైనల్ గా ఆ పోరాటం కంటిన్యూ అయ్యింది.. కేజ్రీవాల్ ని ఓటమి పలకరించింది. ఈ సమయంలో అన్నా హజారే స్పందించారు.

అవును... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార ఆప్ కు వ్యతిరేకంగా వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆధిక్యంలో కమలం పార్టీ దూసుకెళ్తుండగా.. భారీ లీడ్ దిశగా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో.. ప్రముఖ సామాజిక కార్యకర్త, కేజ్రీవాల్ గురువు అన్నా హజారే స్పందిస్తూ.. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓటమి అని అన్నారు.

ఇదే సమయంలో... అధికారంలోకి వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని.. లిక్కర్ స్కాంతో అతడు అప్రతిష్టపాలయ్యారని అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ సర్కార్ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, అందువల్లే కేజ్రీవాల్ ను ప్రజలు ఓడించారని స్పష్టం చేశారు!

ఈ సందర్భంగా... ఒక అభ్యర్థి స్వచ్ఛమైన ప్రవర్తన, స్పష్టమైన ఆలోచనలు, త్యాగ స్ఫూర్తి, నిందారహిత జీవితం కలిగి ఉండాలని తానెల్లప్పుడు చెబుతానని చెప్పిన అన్నా హజారే... ఈ లక్షణాలే ఓటర్ల విశ్వాసాన్ని పొందుతాయని.. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కు తాను సలహాలు, సూచనలు చేసినా అతడు వినలేదని తెలిపారు.

చివరికి మద్యం విధానాలకు అతడు ప్రాధాన్యత ఇచ్చాడని.. డబ్బు, అధికారం అరవింద్ కేజ్రీవాల్ ను తినేశాయని అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 36 అనే సంగతి తెలిసిందే.

Tags:    
  • ArvindKejriwal 
  • AnnaHazare 
  • Delhielections 
  • BJP 
  • AAP 
  • Congress 
  • Delhielections2025 
  • Money 
  • Power 
  • Kejriwal 

Similar News

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్

2026-11-12 04:24 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

బాబు లెక్కకు అందని జగన్ లెక్క !

2026-11-12 03:21 GMT

హైడ్రా రంగనాథ్ మీద నాగ్ పొగడ్తల వర్షం...మ్యాటర్ ఇదే !

2026-11-12 02:22 GMT

Copyright @2026

Powered by Blink CMS