వైసీపీ ఫైర్ బ్రాండ్ రీ ఎంట్రీ వల్ల యూజ్ ఉందా ?
నెల్లూరు జిల్లాలో ఫైర్ బ్రాండ్ గా అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో కనిపిస్తారు. ఆయన జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా మెలిగారు.;
నెల్లూరు జిల్లాలో ఫైర్ బ్రాండ్ గా అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో కనిపిస్తారు. ఆయన జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా మెలిగారు. మూడేళ్ళ పాటు జగన్ కేబినెట్ లో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆయన అంతా అనుకున్నట్లుగా చేశారు. వైసీపీలో ఆయనకు ఎదురు లేకుండా పోయింది.
ఆయన హవా సాగుతూ వచ్చింది. అయితే ఆయన పుణ్యమాని అనేక మంది కీలక నేతలు వైసీపీని వీడిపోయారు అని ప్రచారంలో ఉంది. అర్ధబలం అంగబలం కలిగిన నేతలు కూడా పార్టీకి దూరం అయ్యారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉండలేకపోవడానికి అనిల్ కుమార్ యాదవ్ అని అంటారు.
ఇదిలా ఉంటే వైసీపీ భారీ ఓటమి చెందాక అనిల్ సౌండ్ తగ్గింది ఆయన కనిపించడం లేదు అని వార్తలు వచ్చాయి. ఆయన సొంత వ్యాపారాలతో బిజీగా ఉన్నారని చెన్నైలో ఆయన ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరంగా అనిల్ కుమార్ తాడేపల్లిలో ప్రత్యక్షం అయి జగన్ తో కలసి ఫోటో దిగారు. దాంతో పాటుగా ఈ మధ్యనే వైసీపీ పునర్ వ్యవస్థీకరించిన పీఏసీ లో మెంబర్ గా కూడా కీలక స్థానం దక్కించుకున్నారు
ఇక నుంచి రాజకీయంగా తాను చురుకుగా ఉంటాను అని సంకేతాలు కూడా ఆయన ఇచ్చారు. ఈ క్రమం ఆయన చాలా కాలం తరువాత మీడియా మీటింగ్ ఏర్పాటు చేసి మరీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీదనే విమర్శలు చేశారు.
ఆయన వల్లనే మైనింగ్ బిజినెస్ ని నెల్లూరు లో దెబ్బ తీస్తున్నారని వారి ఉసురు పోసుకుంటున్నారని డైరెక్ట్ ఎటాక్ చేసారు. వరుసగా మైనింగ్ కంపెనీలు మూత పడుతున్నాయని తద్వారా నెల్లూరు జిల్లాకు రావాల్సిన ఆదాయం కూడా వందల కోట్ల నుంచి ఒక్కసారిగా పడిపోయింది అని అనిల్ సంచలన ఆరోపణలు చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ ని ఆపేశారు అని ఆయన ఫైర్ అయ్యారు. తమ వారికి మాత్రమే అనుమతులు ఇచ్చుకుంటూ చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారని ఫలితంగా వారంతా కోర్టుకు వెళ్ళారని చెప్పారు. మైనింగ్ కార్యకలాపాలు లేకపోవడం వల్ల జిల్లాలో ఏకంగా 10 వేల మందికి ఉపాధి పోయిందని ఆయన అన్నారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డికి సంబంధించిన ఇద్దరు మాత్రమే మైనింగ్ చేస్తున్నారు అని ఆయన అన్నారు నెల్లూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆయన అన్నారు ఇలా అనిల్ కుమార్ యాదవ్ తన పాత ప్రత్యర్థిని మరోసారి కొత్తగా టార్గెట్ చేశారు. దాంతో అనిల్ కుమార్ యాదవ్ ఇక మీదట కూటమిలో ఉన్న వారిలో ఎవరిని టార్గెట్ చేస్తారో అర్ధం అయింది అని అంటున్నారు.
వేమిరెడ్డి వంటి వారు ఎపుడైనా మనసు మార్చుకుని వైసీపీలో చేరుతారు అని ప్రచారం కూడా ఉంది. అయితే అలాంటి చాన్స్ లేకుండా వారిని ఎప్పటికీ పార్టీ వైపు చూడకుండా అనిల్ కుమార్ తమ విమర్శల దాడితో టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి అనిల్ కుమార్ విపక్షంలో కూడా తనదైన రాజకీయంతోనే ముందుకు సాగుతున్నారని దీని వల్ల వైసీపీకి నెల్లూరు జిల్లాలో జరిగే మేలు ఏమైనా ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. మరి అనిల్ వైసీపీ పెద్దలకు ఏ రకమైన హామీ ఇచ్చి రాజకీయంగా దూకుడు పెంచుతున్నారన్నది చూడాల్సి ఉంది.