జగన్ విషయంలో బాబు క్లాస్....లైట్ తీసుకుంటున్నారా ?
తాజాగా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే విషయం మీద పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ విషయంలో ఎందుకు సీరియస్ గా ఉండడం లేదని ప్రశ్నించినట్లుగా భోగట్టా.;
ఏపీలో జగన్ ని పులివెందుల ఎమ్మెల్యే అని కూటమి నేతలు విమర్శలు చేస్తారు. ఆయన పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని అంటారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఓడించారని అంటారు. ఇక వైసీపీ అయితే దీని మీద అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. జగన్ ని జస్ట్ ఎమ్మెల్యే అంటారా అని మండిపడుతుంది. ఇలా ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఒక రాజకీయ సమరం భీకరంగా సాగుతూ వస్తోంది. వైసీపీకి అసెంబ్లీలో 11 సీట్లే ఉండొచ్చు. కానీ ఆయన పార్టీకి నలభై శాతం ఓటు షేర్ అయితే ఉంది. దాంతో జగన్ విషయంలో టీడీపీ అధినాయకత్వం గట్టిగానే వ్యవహరించాలని అనుకుంటోంది.
మాకెందుకులే అనుకుంటే :
తాజాగా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే విషయం మీద పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ విషయంలో ఎందుకు సీరియస్ గా ఉండడం లేదని ప్రశ్నించినట్లుగా భోగట్టా. మాకెందుకులే అని వదిలేస్తున్నారా అని కూడా క్లాస్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. జగన్ విషయంలో ముఖ్య నాయకులు అంతా రంగంలోకి దిగాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఎందుకొచ్చింది అని కూర్చుంటే సరిపోదని బాబు గట్టిగానే చెప్పారు.
మంత్రులతో పాటుగా :
ఇక మంత్రుల విషయంలో కూడా చంద్రబాబు కొంత అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. జగన్ ని విమర్శించకుండా ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఆశించిన విధంగా ప్రచారం చేయకుండా ఉంటున్న వారి మీద ఆయన ప్రతీ మంత్రి వర్గ సమావేశంలోనూ చెప్పాల్సింది చెబుతున్నారు. ప్రభుత్వం చేసే మంచి చెప్పాలి, అలాగే విపక్షం చేసే తప్పుడు ప్రచారం ఖండించాలి అని ఆయన నిర్దేశిస్తూనే ఉన్నారు. అయితే ఇపుడు ఆయన పార్టీ ముఖ్య నాయకులను కూడా ఫీల్డ్ లోకి వెళ్ళమంటున్నారు. కేవలం ప్రభుత్వం ఒక్కటే మాట్లాడితే సరిపోదని కూడా స్పష్టంగా చెబుతున్నారు.
విష ప్రచారమే :
జగన్ చేస్తున్నది విష ప్రచారమే అని చంద్రబాబు పార్టీ కీలక నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు అని అంటున్నారు. జగన్ అండ్ కో అసత్యాలనే ప్రచారం చేస్తున్నారు అని బాబు ఫైర్ అయిన్నట్లుగా అంటున్నారు. ఈ తరహా ప్రచారానికి అడ్డు కట్ట వేయాల్సిన బాధ్యత పార్టీ నేతల మీద కూడా ఉందని బాబు చెప్పుకొచ్చారు. ఎప్పటికపుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని ఆయన కోరారు. అంతే కాదు, ఇదే అంశాన్ని ప్రజలలోకి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళాలని బాబు కోరారని అంటున్నారు.
జగన్ ఫ్యాక్టర్ :
ఇదిలా ఉంటే 2024 వరకూ అయిదేళ్ళ పాటు ఏపీని పాలించిన వైసీపీకి 151 సీట్లు దక్కాయి. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా నూటికి తొంబై శాతం సీట్లు వైసీపీవే ఉన్నాయి. ఓటమి చెంది కేవలం పదహారు నెలలు మాత్రమే అయింది. వైసీపీ బలం అన్నది ఉంటుంది, అంతే కాదు ఒక రాజకీయ పార్టీకి ఎపుడూ అపోజిట్ వైపు నుంచి కూడా వైబ్రేషన్స్ వస్తాయి. దాంతో దాని ఉనికి ఆ విధంగానూ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఏపీలో చూస్తే వైసీపీ తప్ప మరో ప్రతిపక్షం లేదు, అందుకే కూటమి పట్ల ఏ మాత్రం వ్యతిరేకత వచ్చినా అది వైసీపీ వైపే మళ్ళుతుంది. అలా కాకుండా చూసుకోవాలంటే పార్టీ మొత్తం రంగంలోకి దిగాలి. టీడీపీ అధినాయకత్వానికి ఈ విషయాలు అన్నీ తెలుసు కాబట్టే పార్టీని కదం తొక్కమంటోంది. మరి టీడీపీ ఆ విధంగా ధాటీగా జగన్ వ్యతిరేక ప్రచారం మొదలెడితే ఆ తరువాత రాజకీయం ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది.