వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ గా ఆయన పేరు మారుమోగుతోంది !

లోకేష్ మీద ఇపుడిపుడే జనాలలో గురి కుదురుతోంది. ఏపీలో చంద్రబాబు పాలన సాగుతోంది. ఆయన నాలుగవ సారి సీఎం గా ఉన్నారు.;

Update: 2025-06-08 05:58 GMT

ఏపీ రాజకీయాల్లో ఎపుడూ హాట్ హాట్ టాపిక్స్ చర్చకు వస్తూంటాయి. ఎందుకంటే జనాలలో ఉన్న రాజకీయ చైతన్యం వల్ల. ఎన్నికలు అయిదేళ్ళకు ఒక మారు జరగవచ్చు కానీ జనాలలో మాత్రం రాజకీయ చర్చ ఆ విధంగా రాజకీయ రచ్చ సర్వ సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. ఏపీలో జనాల విషయం తీసుకుంటే వారికి అవకాశం ఉండాలే కానీ కొత్త దనానికి ఓటు వేస్తారు.

అలాగే కొత్త ఆప్షన్స్ ని కూడా చూస్తూంటారు. అవకాశం వస్తే ఆ కొత్త మోజుని తీర్చుకుంటారు కూడా. అందుకే 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అలాగే చంద్రబాబుని సీఎం గా ఓకే చేసిన జనాలే వైఎస్సార్ ని తెచ్చారు. అదే మాదిరిగా విభజన ఏపీలో 2019లో వైఎస్ జగన్ కి కూడా అవకాశం ఇచ్చారు. ఆయన ఎలా పాలిస్తారో అన్న ఉత్కంఠతోనే ఇదంతా చేశారు.

ఇక ఇపుడు చూస్తే విపక్షంలో వైసీపీ ఉంది. ఆ పార్టీ అయిదేళ్ళ పాలన కూడా కళ్ళ ముందు ఉంది. దాంతో వైసీపీలో తీరూ తెన్నూ మార్చుకుని ఒక సరికొత్త సంచలనం గా ముందుకు వస్తే తప్ప జనాలు ఆ వైపు చూస్తారన్నది పెద్దగా లేదనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక చూస్తే కనుక పవన్ మీద ఒక బలమైన వర్గం ఆశలు పెట్టుకుంది కానీ ఆయనే నాకు చాన్స్ మరో పదిహేనేళ్ళకు కానీ వద్దు అని అనేస్తున్నారు. అంతవరకూ చంద్రబాబే సీఎం కూటమి పాలన సాగాలని కోరుకుంటున్నారు.

ఇక మిగిలింది చూస్తే నారా లోకేష్. ఆయన మీదనే యువతతో పాటు చాలా మంది ఆశలు గట్టిగా ఉన్నాయి. టీడీపీలో జూనియర్లు అంతా లోకేష్ కే ఓటు చేస్తున్నారు. దానికి తగినట్లుగా లోకేష్ సైతం తన పనితీరుని మార్చుకుంటున్నారు. అన్ని విధాలుగా రాటు తేలుతున్నారు. దాంతో జన సామాన్యంలోనూ లోకేష్ గురించే ఎక్కువగా చర్చ సాగుతోంది.

లోకేష్ మీద ఇపుడిపుడే జనాలలో గురి కుదురుతోంది. ఏపీలో చంద్రబాబు పాలన సాగుతోంది. ఆయన నాలుగవ సారి సీఎం గా ఉన్నారు. ఆయన పాలన జనాలు చూసిందే. దాంతో లోకేష్ పాలన చూడాలన్న ఆసక్తి అయితే చాలా మందిలో ఉంది అని అంటున్నారు. అయితే అది ఇప్పట్లో కాకపోయినా ఎప్పటికైనా అవుతుంది అన్నది చాలా మందిలో ఉన్న అతి పెద్ద నమ్మకం.

అందుకే ఏపీలో ఫ్యూచర్ సీఎం ఎవరు అంటే లోకేష్ కే సర్వేలలో ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయి. ఆ విధంగా ఆయన సీఎం పదవికి చాలా దగ్గరగా ఉన్నారని అంటున్నారు. కూటమిలో అత్యంత శక్తివంతమైన పార్టీగా టీడీపీ ఉంది. తొంబై శాతం సీట్లు ఆ పార్టీకి ఉన్నాయి. టీడీపీలో లోకేష్ బలమైనే నేతగా ఆవిష్కరించబడుతున్నారు. దాంతో లోకేష్ కంటే ఎవరికి చాన్స్ ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది.

అలా వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ గానే లోకేష్ ఇపుడు కూటమిలో ఉన్నారు. ఆయన కచ్చితంగా సీఎం అవుతారు అని బలంగా నమ్ముతున్న వారు అంతా ఆయనలోనే అన్నీ చూసుకుంటున్నారు. దాంతో ఏపీలో చూస్తే లోకేష్ చుట్టూ పాలిటిక్స్ తిరుగుతోంది అని చెప్పాలి. నాలుగు పదుల పైబడిన ఈ నవ యువకుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకుని వస్తారని అలా జరగాలని ఎపుడూ కొత్త ఆప్షన్స్ వెతికే సగటు జనాలు కూడా లోకేష్ వైపే చూస్తున్నారు. మొత్తానికి లోకేష్ కి మెండుగా నిండుగా అవకాశాలు ఉన్నాయి.

ఇక గాసిప్స్ సైతం ఒక్కలా లేవు 2027 నాటికి లోకేష్ సీఎం అవుతారని చంద్రబాబు రాష్ట్రపతి అవుతారని కూడా పుకార్లు పుట్టించేవారూ ఉన్నారు. అంటే 2029 ఎన్నికలకు రెండేళ్ళ ముందు లోకేష్ పట్టాభిషేకం అన్న మాట. 2027 ఎందుకు అంటే ఆ ఏడాది జూలైలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక ఉంది. ఆ పదవికి బాబుని ఎంపిక చేస్తారు ఆయన అనుభవానికి అది తగినది అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ గాసిప్స్ నిజమా కాదా అన్నది. ఏది ఏమైనా లోకేష్ ని సీఎం ని కలిపేసి వండి వారుస్తున్న కధనాలు మాత్రం ఏపీ రాజకీయాల్లో నానాటికీ పెరిగిపోతున్నాయి. సో అదన్న మాట అసలు సిసలైన మ్యాటర్.

Tags:    

Similar News