బాబును మరిపిస్తున్న చిన్నబాబు.. విషయం ఇదీ!
తొలుత భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కలుసుకున్న నారా లోకేష్.. ఏపీలోడేటా సెంటర్ ఏర్పా టుకు సహకరించాలని విన్నవించారు.;
ఏపీ సీఎం చంద్రబాబును మరిపిస్తున్నారు ఆయన కుమారుడు, టీడీపీ నాయకులు చిన్నబాబు అని పిలు చుకునే మంత్రి నారా లోకేష్. తాజాగా ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకు న్న ఆయన.. బిజీ బిజీగా గడుపుతున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అంటే.. ఆయన నిరంతరం.. బిజీ అనేమాట వినిపిస్తుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ నారా లోకేష్ కూడా అలానే బిజీగా గడుపుతున్నారు. ఉదయం నుంచి పలువురు మంత్రులను అధికారులను కలుసుకుంటున్నారు. ఏపీకి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావిస్తూ.. నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తొలుత భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కలుసుకున్న నారా లోకేష్.. ఏపీలోడేటా సెంటర్ ఏర్పా టుకు సహకరించాలని విన్నవించారు. ఏపీ ఐటీ రాజధాని విశాఖలో వచ్చే రెండేళ్లలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా ఇప్పటికే రెడీ అయిందని.. వివరించారు. డేటా సెంటర్ రాకతో.. రాష్ట్రంలోని ఐటీ, బీటెక్ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. డేటా సెంటర్‌కు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను నారా లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు.
మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ నారా లోకేష్ భేటీ కానున్నారు. ఏపీ రాజధా ని, పోలవరం సహా.. పెట్టుబడులకు అనుకూల వాతావరణాలపై ఆమెకు వివరించనున్నారు. పెట్టుబడుల సాధన దిశగానే ఈ పర్యటన కొనసాగుతుం దని మంత్రి లోకేష్ పోస్టు చేశారు. ఏపీని పెట్టుబడులకు గమ్య స్థానంగా మార్చనున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు ఏపీకి వచ్చేలా సహకరించాలని కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామిని కోరారు. విశాఖ ఉక్కును బలోపేతం చేసేందుకు.. కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోనూ నారా లోకేష్ సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు.
ఇటీవల రాజధాని అమరావతి ప్రాంతానికి కేటాయించిన రైల్వే లైన్ సహా.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ విషయంలో రైల్వే మంత్రి స్పందిస్తున్న తీరుకు కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్తు లోనూ.. ఏపీకి మరిన్ని ప్రాజెక్టులు ఇవ్వాలని నారా లోకేష్ ఆయనను కోరారు. ఇక, మంగళవారం కూడా నారా లోకేష్ ఢిల్లీలో పర్యటన కొనసాగించనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ కానున్నారు. పీ-4 సహా పెట్టుబడులపై చర్చించనున్నట్టు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మీడియా వర్గాలకు తెలిపారు.