యుద్దానికి సై...భారత్ కు ఏపీ హై...
ఇకపై యుద్దమంటూ ఎవరు బెదిరించినా భారత్ భయపడే పనే లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగ నాలుగు రక్షణాయుధాల తయారీ కేంద్రాలను ఆంధ్రలో ప్రారంభించబోతున్నారు.;
ఇకపై యుద్దమంటూ ఎవరు బెదిరించినా భారత్ భయపడే పనే లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగ నాలుగు రక్షణాయుధాల తయారీ కేంద్రాలను ఆంధ్రలో ప్రారంభించబోతున్నారు. ఆయుధాలకోసం అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని సహించాల్సిన పరిస్థితి నుంచి భారత్ ముందడుగు వేస్తోంది. అంతేకాదు అవసరమైతే యుధ్ద ఆయుధాలను ఎగుమతి చేసేందుకు సై అంటోంది. దీంతో దేశంలో అతిపెద్ద రక్షణాయుధాల తయారీ హబ్ గా ఏపీ అవతరించబోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తనను తాను సంసిద్ధం చేసుకోడంలో నిమగ్నమైంది. ఈ యుద్ధంలో దాయాది పాకిస్తాన్ ను మట్టి కరిపించిన దరిమిలా...అగ్రరాజ్యం అమెరికా పెత్తనాన్ని సైతం సుతిమెత్తంగా తిరస్కరించింది. భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలున్నప్పడు...ఇరు దేశాల వ్యవహారాల్లో అమెరికా పెద్దన్న తలదూర్చాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా భారత్ ప్రదాని సందేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారత్ ఏపీని హబ్ గా మార్చి నాలుగు రక్షణాయుధాల తయారీ కేంద్రాలను స్థాపించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్ మడకశిర ప్రాంతంలో హెచ్ ఎఫ్ సీఎల్ కోసం ఏకంగా వెయ్యిఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ కేంద్రంలో గ్రెనేడ్లు, ఆర్టిలరీ షెల్స్ తదితర ఆయుధాలను తయారు చేస్తారు. అలాగే దొనకొండలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీ ఆయుధాలతోపాటు ఆయుధాలను మండించే గ్యాస్ తదితర ఇంధనాలను తయారుచేస్తుంది. ఇక అనకాపల్లిలో బీడీఎల్ కంపెనీ జలాంతర్గతంగా వినియోగించే యుద్ధపరికరాలు, సన్నగా పొడువుగా ఉంటే బాంబుల్ని తయారు చేస్తుంది. జలాంతర్గత యుద్దానికి ఇది వెన్నుదన్నుగా నిలుస్తుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద కూడా ఓ ప్రత్యేక ఆయుధ తయారీ కేంద్రం రానుంది.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేపథ్యంలో ఆంధ్రలో గగనతలంలో ...జలాంర్గతంగా ...ప్రయోగించే యుద్ధ ఆయుధాలు, గ్రనేడ్లు బాంబులు తయారీ కేంద్రాలు శరవేగంతో రానున్నాయి. ఈ పరిణామంతో రానున్న కాలంలో దేశంలో ఏపీకి ప్రత్యేక స్థానం దక్కబోతోంది. రక్షణవిభాగంలో ఏపీ తన ఉనికిని చాటుకోబోతోంది. మడకశిర, దొనకొండ, అనకాపల్లి, ఓర్వకల్లు ఈనాలుగు కేంద్రాల్లో యుద్దాయుధాల తయారీ కేంద్రాలు రావడంతో వీటి రూపురేఖలే మారిపోనున్నాయి. సీఎం చంద్రబాబు విజన్ వల్ల ఇప్పటికే కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఏపీ మున్ముందు మరింత ప్రాధాన్య స్థానాన్ని సాధించుకోగలుగుతుంది.
ఈ క్రమంలో రానున్న అయిదేళ్ళలో ఏరో స్పేస్, డిఫెన్స్ పాలసీ 4.0 ద్వారా ఏపీ లక్ష కోట్ల పెట్టుబడుల్ని లక్ష్యంగా పెట్టుకుని వడివడిగా అడుగులేస్తోంది. రక్షణాయుధాల, విడిపరికరాల తయారీ కేంద్రాలు, ఎమ్మార్వో ఆర్ అండ్ డి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. విభజనానంతరం ఏపీకి కూటమి హయాంలో మహర్దశ పట్టనుంది.