కూట‌మి పాల‌న‌పై స‌ర్వే.. ఏం తేలింది?

''ఆడ‌బిడ్డ' నిధి అని చంద్ర‌బాబు చెప్పారు. ఇప్పుడు మాకు ఇవ్వ‌ట్లేదు. ఎవ‌రిని అడ‌గాలి?'' అని క‌ర్నూ లు జిల్లాకు చెందిన మ‌హిళ‌లు కొంద‌రు స‌ర్వేలో వ్యాఖ్యానించారు.;

Update: 2025-04-12 15:30 GMT

ఏపీలో కూట‌మి పాల‌న‌కు ప‌ది మాసాలు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు గ‌త నెల రోజులుగా ముంద‌స్తుగానే ఐవీఆర్ ఎస్ ఫోన్ కాల్ స‌హా.. మెసేజ్‌ల రూపంలో త‌న పాల‌న‌పై ప్ర‌జ‌ల నుంచి అభిప్రా యాలు సేక‌రించారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు విజ‌న్ పై ఎక్కువ మంది సానుకూలంగానే స్పందించినా.. కొంద‌రు మాత్రం పెద‌వి విరిచారు. పైకి మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. మ‌హిళ‌ల్లో సూప‌ర్ సిక్స్ ప్ర‌భావం ఆశ‌లు రెండూ కూడా ఎక్కువ‌గానే ఉన్నాయ‌ని గుర్తించారు.

''ఆడ‌బిడ్డ' నిధి అని చంద్ర‌బాబు చెప్పారు. ఇప్పుడు మాకు ఇవ్వ‌ట్లేదు. ఎవ‌రిని అడ‌గాలి?'' అని క‌ర్నూ లు జిల్లాకు చెందిన మ‌హిళ‌లు కొంద‌రు స‌ర్వేలో వ్యాఖ్యానించారు. రైతులు గిట్టుబాటు ధ‌ర‌లేద‌ని.. వ్యాపా రుల మాయ‌లో ప‌డి అల్లాడుతున్నామ‌ని చెప్ప‌డం ద్వారా సాగుకు సంబంధించి సర్కారుపై కొంత మేర‌కు అసంతృప్తి ఉంద‌న్న విష‌యం తెలిసింది. ఇక‌, విద్యార్థులు కూడా.. ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు నిధులు లేక‌.. ఇబ్బందులు ప‌డుతున్న వైనం స‌ర్వేలో స్ప‌ష్టమైంది.

మ‌రోవైపు.. కూట‌మి స‌ర్కారు ఇస్తున్న పింఛ‌న్ల‌పై పింఛ‌ను దారులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. చంద్రబాబులో మారిన నాయ‌కుడిని చూస్తున్నామ‌ని కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు చెబుతున్నారు. అదేవిధం గా టీడీపీకి బ‌ల‌మైన కంచుకోట‌ల వంటి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోనూ... ప్ర‌జ‌లు సానుకూలంగానే స్పందించారు. ఇక‌, ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల‌పై ప్ర‌భుత్వం ఆశించిన విధంగా అయితే.. ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న క‌నిపించ‌డం లేదని తెలిసింది.

నాలుగు నెల‌ల‌కు ఒక్క బండ ఇవ్వ‌డం.. ల‌క్ష‌ల సంఖ్య‌లో వినియోగదారుల‌కు ఇప్ప‌టికీ కూడా.. సొమ్ము లు జ‌మ కాక‌పోవ‌డం వంటివి స‌ర్కారు విష‌యంలో ఇది మేలు చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు విద్యుత్ ధ‌ర‌లు.. నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల విష‌యాన్ని ప్ర‌జ‌లు ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌తి విష‌యంలో నూ ఇలా కూలంక‌షంగా వివ‌రాలు రాబ‌ట్టిన స‌ర్వే.. కూట‌మికి అయితే.. మంచి మార్కులే ప‌డ్డాయ‌ని పేర్కొంది. దీనిపై చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్టు సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News