పర్యాటకశాఖ వినూత్న ప్రయత్నం.. ఐడియా అదుర్స్!

మరి ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ పర్యాటకులను ఆకర్షించడానికి ఎలాంటి పద్ధతులను అవలంబిస్తోందో ఇప్పుడు చూద్దాం.;

Update: 2026-01-06 07:48 GMT

ప్రపంచం నలుమూలల ఎన్నో పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ గజిబిజి లైఫ్ స్టైల్ లో వెకేషన్ కి వెళ్లడానికి చాలామందికి సమయం కుదరడం లేదు. తద్వారా పర్యాటక శాఖకు కూడా భారీగా ఆదాయం తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే పర్యాటకులను పర్యాటక ప్రదేశాలకు రప్పించడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వేస్తున్న అడుగులు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా పర్యాటకశాఖ చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నానికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇది వర్కౌట్ అయిందంటే మాత్రం ఆదాయం మరింత పెరుగుతుందని రాష్ట్ర ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లదు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ పర్యాటకులను ఆకర్షించడానికి ఎలాంటి పద్ధతులను అవలంబిస్తోందో ఇప్పుడు చూద్దాం.

ప్రతి ఒక్కరూ హాలిడేస్ వస్తే కచ్చితంగా వెకేషన్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అయితే మరి కొంతమంది దూర ప్రయాణాలకు వెళ్లాలనే కోరిక ఉన్నా.. ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి వినూత్న అవకాశం అందుబాటులోకి తీసుకువచ్చింది రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ. పర్యాటకులకు సరికొత్త అనుభవాలను అందించే కారవాన్ వాహనాలు రాష్ట్రంలో ఇప్పుడు మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి. వీటిని మొదటి నాలుగు మార్గాల్లో నడపనున్నారు.

రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ పోర్టల్ ద్వారా వాహనాలను బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంప్యానల్ చేసిన రెండు సంస్థలు ప్రస్తుతానికి నాలుగు కారవాన్ లలో తిప్పనున్నాయి. కేరళ, గోవా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యాటకుల కోసం పెద్ద ఎత్తున నడుపుతున్న కారవాన్ లను ఇప్పుడు ఏపీలో కూడా ప్రవేశం పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపోతే దీనిపై పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం.

ఇందులో ఓజీ డ్రీమ్ లైనర్స్, ఇండియా లక్సీ కారవాన్ ఎల్.ఎల్.బి సంస్థలను ఏపీటీడీసీ ఎం ప్యానెల్ చేసింది. 10 - 12 సీట్లు, 5 - 6 సీట్లు కలిగిన రెండు రకాల , కారవాన్ వాహనాలను ఈ సంస్థలు నడపనున్నాయి. ప్రస్తుతానికి ఈ సంక్రాంతికి ఆరు రోజుల ప్యాకేజీతో హైదరాబాదు నుంచి భీమవరం, దిండి వరకు నడపనున్నారు.ఈనెల 10, 11, 12 తేదీలకు బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి ఆరు రోజులపాటు ఈ ప్యాకేజ్ అమల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు తేదీలలో హైదరాబాదు నుంచి ఈ నాలుగు కారవాన్ లు నడపనున్నారు.

ముఖ్యంగా ఆరు రోజులపాటు ప్రధానంగా నాలుగు రూట్లల్లో ఈ వాహనాలను నడపనున్నారు.

మొదటి మార్గం.. విశాఖపట్నం - అరకు, లంబసింగి

రెండవ మార్గం.. విశాఖపట్నం నుంచి సింహాచలం, అన్నవరం, పిఠాపురం , సామర్లకోట, ద్రాక్షారామం మీదుగా వాడవల్లికి వెళ్తుంది.

మూడవ మార్గం.. హైదరాబాదు నుండి గండికోట

నాల్గవ మార్గం.. హైదరాబాదు నుండి సూర్యలంక..

ఇలా ఈ నాలుగు మార్గాలలో ఈ ఆరు రోజులపాటు కారవాన్ లను నడపడానికి పర్యాటక శాఖ సన్నహాలు సిద్ధం చేస్తోంది . ఇకపోతే వీటిలో అన్ని వసతులు ఉంటాయి. కూర్చుని సీట్లను నిద్రపోవడానికి వీలుగా మార్చుకోవచ్చు. అలాగే వాహనంలో టీవీ , ఫ్రిజ్ , వాష్రూమ్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. ఆహారం కోసం అవసరమైన చోట హోటల్ వద్ద ఆపుతారు. భోజనం ఖర్చులు పర్యాటకులే భరించుకోవాలి. రాత్రిపూట పర్యాటకశాఖకు చెందిన హోటళ్ల ప్రాంగణాల్లో వాహనం పార్కింగ్ చేస్తారు. హోటళ్లు లేని చోట భద్రత దృష్ట్యా సమీప ప్రభుత్వ కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్ల పరిసరాలలో నిలుపుతారు. సంక్రాంతికి చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం గనుక సక్సెస్ అయ్యింది అంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ కారవాన్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ప్రభుత్వం చేపట్టిన ఈ సరికొత్త ఐడియా ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి

Tags:    

Similar News