చంద్రబాబు వార్నింగులు.. జగన్ జోకులు.. వాట్ నెక్ట్స్ ..!
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గత నాలుగు రోజులుగా వైసీపీ విషయంలో తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. వార్నింగులు కూడా ఇస్తున్నారు.;
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గత నాలుగు రోజులుగా వైసీపీ విషయంలో తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. వార్నింగులు కూడా ఇస్తున్నారు. అయితే.. వీటిని వైసీపీ అధినేత జగన్ లైట్ తీసుకుంటున్నా రు. జోకులు పేలుస్తున్నారు. మరి ఈ రెండు పరిణామాలను గమనిస్తే.. తదుపరి ఏం జరుగుతుంది? వాట్ నెక్ట్స్? అనేది ఆసక్తిగా మారింది. ప్రధానంగా వైసీపీ.. ఇంటింటికీ కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత.. కూటమిలో కొంత ఆలోచన ఏర్పడింది.
మరీ ముఖ్యంగా టీడీపీలో చర్చ అయితే సాగుతోంది. 'రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో` పేరుతో జగన్ ఇచ్చిన పిలుపుతో.. నాయకులు ప్రజల మధ్యకువెళ్లేందుకు రెడీ అయ్యారు. దీనిని ఆయన నాయకులకు టార్గెట్‌గా కూడా పెట్టారు. గత ఎన్నికలకు ముందు సూపర్ 6తో పాటు.. 143 హామీలు గుప్పించారని.. దీనికి తోడు ప్రతి ఇంటికీ.. ఆయా కుటుంబ పెద్దల పేరుతో బాండ్లు ఇచ్చారని.. ఇప్పుడు వీటిని కూడా ప్రజలకు గుర్తు చేయాలని జగన్ చెబుతున్నారు.
ఈ క్రమంలో ఇటు సోషల్ మీడియాలోను.. అటు ప్రధాన మీడియా సాక్షిలోనూ.. ఐదు వారాల పాటు.. కూట మి సర్కారుపై ప్రచార యుద్ధాన్ని జగన్ ప్రారంభించారు. డిజిటల్ రూపంలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయ డం ద్వారా.. నాటి చంద్రబాబు హామీలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది లేని వారికి నేరుగా నాయకులు సదరు బాండ్లతో కలవనున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలను.. ప్రచార యుద్ధాన్ని కూడా.. యూటర్న్ తీసుకునేలా చేయనుంది.
దీనిని గమనించారో ఏమో చంద్రబాబు సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. సూపర్ 6 అన్నీ అయిపోయాయని.. ఎవరైనా కాదు లేదని అడిగితే.. తాట తీస్తామని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి మరీ ఆయన సీరియస్‌గానే కామెంట్లు చేశారు. కానీ.. వీటిని జగన్ లైట్ తీసుకుంటున్నారు. ఏం చేస్తారో.. చేయనీ.. ప్రజల తాట అయితే.. తీయలేరుకదా? అని జోక్ చేశారు. అంతేకాదు.. ప్రజల మధ్యకు వెళ్లకుండా తమను ఎవరూ ఆపలేరని కూడా చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. గ్రామాల స్తాయిలో ఇరు పార్టీల మధ్య రాజకీయ వివాదాలు, రగడలు, ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఇదే జరిగితే.. సర్కారుకు మరో ఇబ్బంది తప్పదు. దీనిని సానుకూలంగా చూస్తే ఫర్వాలేదు. కానీ.. ఇరు పక్షాలు అలా లేకపోవడంతో ఏమైనా జరగొచ్చన్నది పరిశీలకులు కూడా చెబుతున్న మాట.