• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రాణం తీసిన స్నేహితుల...

ప్రాణం తీసిన స్నేహితుల సరదా.. మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్

| సరదాకు ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి ప్రాణాలు కోల్పోయిన ఒక షాకింగ్ ఉదంతం బెంగళూరులో చోటు చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2024-03-29 06:52 GMT

సరదాకు ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి ప్రాణాలు కోల్పోయిన ఒక షాకింగ్ ఉదంతం బెంగళూరులో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య సాగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకరిని బలి తీసుకుంది. వాహనాలకు వాష్ చేసిన తర్వాత నీళ్లను తుడిచేందుకు ఉపయోగించే ఎయిర్ బ్లోయర్ నాజిల్ ను స్నేహితుడి మర్మాంగంలోకి జొప్పించిన ఉదంతం ప్రాణం పోయేలా చేసింది. అసలేం జరిగిందంటే..

బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల యోగేశ్.. పాతికేళ్ల మురళీ ఇద్దరు స్నేహితులు. మురళీ స్థానిక వాషింగ్ సెంటర్ లో పని చేస్తుంటాడు. ఇటీవల తన బైక్ నను వాష్ చేయించేందుకు మురళీ వద్దకువెళ్లాడు. తన బైక్ కు వాటర్ సర్వీసింగ్ చేయాలని కోరిన నేపథ్యంలో.. మురళీ ఆ పని చేశాడు. ఈ క్రమంలో వారిద్దరు అక్కడున్న ఎయిర్ బ్లోయర్ తో సరదాగా ఆడుకున్నారు.

ఇందులో భాగంగా ఎయిర్ బ్లోయర్ తో యోగేశ్ ముఖం మీద మురళీ కొట్టగా.. అతను తప్పించుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య సరదా తోపులాట సాగింది. ఈక్రమంలో మిత్రుడ్ని బలంగా పట్టుకున్న మురళీ.. బ్లోయర్ నాజిల్ ను యోగేశ్ మర్మాంగంలోకి జొప్పించి.. దాన్ని ఆన్ చేశాడు. తీవ్రమైన ప్రెషర్ తో అతడి పొట్ట ఉబ్బిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు.

దీంతో వెంటనే మిత్రుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. యోగేశ్ ను పరీక్షించిన వైద్యులు.. అతడి అంతర్గత ఆవయువాలు దెబ్బ తిన్నట్లుగా గుర్తించారు. అయినప్పటికీ అతడికి చికిత్స చేస్తున్న క్రమంలోనే యోగేశ్ ప్రాణాలు పోయాయి. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి ప్రాణాలు తీసిన మురళీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరదాకు హద్దు ఉంటుందని.. దాన్ని అధిగమిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానికి ఈ ఉదంతం ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు.

Tags:    
  • Bengaluru 
  • Waterservicingcenter 
  • Washing 
  • PatialaMurali 
  • Yogesh 
  • Airblower 
  • Friends 
  • FunwithFriends 

Similar News

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

Copyright @2026

Powered by Blink CMS