అమెరికాలో ఘనంగా అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ వివాహం
వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.;
వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె డాక్టర్ శ్రీజ, హర్షాతో వివాహ బంధంలో అడుగుపెట్టారు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని మహాలక్ష్మీ దేవాలయంలో ఈ వివాహం వైభవంగా జరిగింది.
వివాహం సంప్రదాయ తెలుగు ఆచారాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో అందంగా సాగింది. కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు ప్రత్యక్షంగా హాజరై ఆశీర్వదించగా.. భారత్‌లోని మిత్రులు, అభిమానులు వర్చువల్‌గా శుభాకాంక్షలు తెలియజేశారు.
డాక్టర్ శ్రీజ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తున్నారు. వైద్య రంగంలో ఆమె సాధించిన ప్రతిభ ప్రశంసనీయం. మరోవైపు వరుడు హర్షా అమెరికాలో డోయిచ్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
వివాహ వేడుకలో అంబటి రాంబాబు స్వయంగా అతిథులను ఆతిథ్యం పలుకుతూ.. పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డితో సుదీర్ఘ రాజకీయ అనుబంధం కలిగిన అంబటి రాంబాబు, కుటుంబ ఈ వేడుకను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.
వివాహ అనంతరం.. నూతన దంపతులు తమ వృత్తిజీవితాన్ని అమెరికాలోనే కొనసాగించనున్నారు. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మిత్రులు, పార్టీ నాయకులు, అభిమానుల కోసం ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.