రాష్ట్రంలో రాజ‌ధాని ర‌చ్చ‌.. చంద్ర‌బాబు క‌ద‌లాలి ..!

రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాదాపు 40 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాజధానిని నిర్మిస్తున్నారు;

Update: 2025-06-22 01:30 GMT

రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాదాపు 40 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాజధానిని నిర్మిస్తున్నారు. ఇది తప్పు కాదు. ఎందుకంటే భవిష్యత్తులో రాజధాని ప్రాంతం పెట్టుబడులకు స్వర్గధామంగా మారి పెట్టుబడులు వచ్చి సొంతంగానే ఆదాయం వనరులను సమకూర్చుకొని తన అప్పును తనే తీర్చుకునే దిశగా వెళుతుంది అనేది చంద్రబాబు చెబుతున్న మాట. వాస్తవానికి అభివృద్ధి జరిగి పెట్టుబడులు వచ్చి ఆదాయం పెరిగితే ఎవరికి ఇబ్బంది లేదు. ఇది మంచి ప్రయోగం.

అయితే.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో కూటమి పాలకులు విఫలమవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే తాజాగా నిర్వహించిన రెండు సర్వేల్లో అమరావతి రాజధానికి మాత్రమే పెట్టుబడులు పెట్టేస్తున్నారని, ఆ ఒక్క ప్రాంతాన్ని మాత్రమే చంద్రబాబు పట్టించుకున్నారని ఇతర ప్రాంతాలను పెద్దగా పట్టించుకోవడంలేదని 59 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇది ప్రమాద సంకేతం అని చెప్పాలి. ఒక రాజధానికి మాత్రమే డబ్బులు పెడుతున్నారు, మా ప్రాంతాన్ని పట్టించుకోవడంలేదని అనంతపురం జిల్లా ప్రజలు ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఒక అమరావతి కాదు ఇతర ప్రాంతాల్లో కూడా పట్టించుకోవాలని తమ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని రాజమండ్రి కి చెందిన మెజారిటీ ప్రజల అభిప్రాయ పడినట్టు ఒక సర్వే సంస్థ వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్ర సంగతి చెప్పనక్కర్లేదు. ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది. పట్టించుకుంటే ఎన్ని పనులైనా చేయొచ్చు. కానీ ఏ ప్రభుత్వము ఇక్కడ పట్టించుకోవడం లేదు. గతంలో ఉద్దానంలో కిడ్నీకి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు టిడిపి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కొంతమేరకు చేశాయి.

కానీ ఇంకా మిగిలిపోయిన పనులు చాలానే ఉన్నాయి. ఇక కర్నూల్ లో తాగునీటి స‌మ‌స్య‌, ఉత్తరాంధ్రలో నీటి సమస్య, వలసలు ఇవన్నీ కూడా అభివృద్ధి ప్రధానంగా కారణంగా మారింది. దీనినే సర్వేల్లో ప్రజలు ప్రస్తావించారు. వలసలపై మాట్లాడుతూ చాలామంది తమ ప్రాంతంలో పనులు లేకపోవడం అభివృద్ధి లేకపోవడం వల్లే మేము వలస పోతున్నామని కుటుంబాలకు కుటుంబాలను వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తోందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి.

ఒక అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు అన్న మాటను ప్రజల నుంచి తుడి చేయడం కాకుండా వారికి అర్థమయ్యేలాగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పే విషయంలో చంద్రబాబు స్పష్టంగా చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ప్రజల వద్దకు పంపించాలి. ఒక్క రాజధాని మాత్రమే అభివృద్ధి చెందడం కాదు రాష్ట్రం మొతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న సందేశాన్ని అయినా ఇవ్వగలగాలి. లేకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగి ప్రభుత్వానికి నష్టపరిచే అవకాశం ఉంటుందన్నది సర్వేల ద్వారా తెలుస్తున్న విషయం.

Tags:    

Similar News