అమరావతిలో విమానాశ్రయం.. ఓ పెద్ద కాంట్రవర్సీ....|
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.;
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే.. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదంగా మారింది. చాలా చోట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు విపక్ష వైసీపీ దుమ్మెత్తి పోస్తోంది. మరి ఏం జరిగింది? ఎందుకు ఇలా? అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. అమరావతి మహా రాజధానిని 33వేల ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దీనికి భూ సమీకరణ చేశారు.
అయితే.. ఇక్కడ పెట్టుబడులు వచ్చేందుకు.. రాష్ట్ర చరిత్ర జగద్విఖ్యాతి అయ్యేందుకు మరిన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దీనిలో ప్రధానంగా ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చేందుకు, పెట్టుబడులు పెట్టాలనుకు నే వారు వచ్చేందుకు కూడా.. రాజధానిని మరింత హైలెవిల్‌కు తీసుకువెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే నేరుగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తే బెటర్ అని చంద్రబాబు భావించారు. దీనివల్ల రాజధానికి రవాణా యాక్సిస్ పెరుగుతుంది.
అయితే.. దీనికి భూమి సేకరించాలని ముందు భావించారు.తద్వారా.. రైతులకు కొంత పరిహారం ఇచ్చి.. భూమిని తీసుకుంటారు. కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు.. కొందరికి రైతులు మొర పెట్టుకున్నారు. తమ భూములు సేకరించడం కాకుండా.. సమీకరించాలని(పూలింగ్) తద్వారా రాజధాని రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో.. తమకు కూడా కలుగుతాయని వారు కోరారు. దీనికోసమే రైతులు కూడా ఉద్యమాలు చేపట్టారు.
తమ భూములు సేకరించడం కాదని, సమీకరించాలని రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇదే చేయాలంటే.. మరిన్ని ఎకరాలు ఎక్కువగా సేకరించాల్సి ఉంటుంద ని ప్రభుత్వం చెబుతోంది. అంటే.. 30 నుంచి 40 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. దీనిలో విమానాశ్రయం కోసం 5 వేల ఎకరాలను వినియోగించి... రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు, మౌలిక సదుపాయాల కోసం.. మిగిలిన భూమిని వినియోగిస్తారు. అయితే.. ఈ విషయాన్ని కన్వే చేయడంలోనూ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా.. మళ్లీ భూమి సమీకరణ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.