పుట్టింట్లోనే భార్య.. బిడ్డ డీఎన్ఏ కోరిన భర్త.. కోర్టు కీలక వ్యాఖ్యలు!

వివరాళ్లోకి వెళ్తే... పిటిషనర్ ప్రకారం... అతను ఓ మహిళను ఏప్రిల్ 2008లో వివాహం చేసుకున్నాడు.;

Update: 2025-11-27 10:30 GMT

భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా, అవి విడాకుల వరకూ వెళ్లకుండానే ఉండాలి కానీ... ఒక్కసారి మెదడులో ఆ పురుగు ఎవరికి వచ్చినా, అది ఇరు జీవితాలకు, ప్రత్యేకంగా అవతలి వ్యక్తిని ప్రత్యక్ష నరకం చూపిస్తుందనడంలో సందేహం లేదని చాలామంది స్వానుభవంతో చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా పిల్లల డీఎన్ఏ కోరిన తండ్రి విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... చట్టపరమైన విచారణ సమయంలో పిల్లల పితృత్వాన్ని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్షను కోరారు ఓ వ్యక్తి. ఇందులో భాగంగా... 2011 మే నుంచి పుట్టింట్లోనే ఉన్న తన భార్య, 2012 డిసెంబర్ లో బిడ్డకు జన్మనిచ్చిందనే కారణాన్ని కోర్టుముందుంచారు! ఈ సందర్భంగా స్పందించిన న్యాయస్థానం... పిల్లల పితృత్వాన్ని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్షను సాధారణ పద్దతిలో నిర్దేశించలేమని తెలిపింది.

వివరాళ్లోకి వెళ్తే... పిటిషనర్ ప్రకారం... అతను ఓ మహిళను ఏప్రిల్ 2008లో వివాహం చేసుకున్నాడు. ఆమె తన వైవాహిక ఇంట్లో ఒక వారం మాత్రమే నివసించింది. ఆమె గ్రాడ్యుయేట్, తాను నిరక్షరాస్యుడు కాబట్టి.. ఆమె అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడలేదు. ఈ క్రమంలో ఆమె 2012 డిసెంబర్ లో ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

అయితే... ఆమె తన జీవసంబంధమైన కుమార్తె కాదని.. తన భార్య 2011 మే నుంచి తన తల్లితండ్రుల ఇంట్లోనే నివసిస్తుందని అతడు ఆరోపించాడు. అయితే... తాజాగా ఈ పిటిషన్ ను తోసిపుచ్చుతూ అలహాబాద్ హైకోర్టు జస్టిస్ చవాన్ ప్రకాశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... దంపతుల మధ్య చట్టపరమైన వివాదాలు ఉన్నప్పుడు రొటీన్ మ్యానర్ లో పిల్లలకు డీఎన్ఏ టెస్టు కుదరదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News