సీజేపీకి కొత్త సారధి...జంతర్ మంతర్ కంటిన్యూ

మరో వైపు చూస్తే అక్టోబర్ 10వ తేదీ ఒక్క రోజున మాత్రం ఢిల్లీ మొత్తం ఆంక్షలు పెట్టారు. రవాణా మొబైల్ ఇంటర్నెట్ వంటి వాటి మీద ఆంక్షలు కొనసాగాయి.

Update: 2026-10-10 10:12 GMT

జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కార్యక్రమాలను అడ్డుకోవాలని ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందులో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేని ఏకంగా విమానంలో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వస్తూండగానే అరెస్టు చేశారు. ఆయనతో పాటు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకా వంటి కీలక నేతల అరెస్టులతో సీజేపీ జంతర్ మంతర్ నిరసనలకు బ్రేక్ పడతాయని భావించారు. కానీ అనూహ్యంగా సీజేపీ నిరసనలకు కొత్త సారధిని సిద్ధం చేశారు. తన అరెస్ట్ ఉంటుందని ముందే ఊహించిన అభిజిత్ దీప్కే తమ పార్టీకి చెందిన ఒక కీలక నేతకు జంతర్ మంతర్ నిరసనలు నిర్వహించే బాధ్యతలు అప్పగించారు. ఆయన ఎవరో కాదు 35 ఏళ్ల అజింక్య షిండే.

ఆప్ లో కీలక నేతగా :

ఇంతకీ అజింక్య షిండే ఎవరు అన్నది చూస్తే ఆయన ఆప్ మాజీ నేతగా చెబుతున్నారు. ఆయనకు రాజకీయ పరంగా అనుభవం ఉంది. అంతే కాదు ఆమ్‌ ఆద్మీ పార్టీ యువజన విభాగంలో మహారాష్ట్ర కన్వీనర్‌గానూ గోవా సహ ఇన్‌చార్జిగా గతంలో పనిచేసి ఉన్నారు. ఇక పనిచేశారు. ప్రస్తుతం అజింక్య షిండే సీజేపీలో సంస్థాగత వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంతో ఆయన భుజ స్కందాల మీదనే జంతర్ మంతర్ సీజేపీ నిరసన బాధ్యతలను అభిజిత్ దీప్కే చాలా వ్యూహాత్మకంగా పెట్టారు. దాంతో కాస్తా లేట్ అయినా సీజేపీ నిరసనలు అయితే జంతర్ మంతర్ వద్ద ప్రారంభం కాబోతున్నాయని అంటున్నారు.

సీజేపీ 2.0 :

జంతర్ మంతర్ వద్ద సీజేపీ 2.0 నిరసనలకు శ్రీకారం చుడుతోంది. గతంలో ఏకంగా ఒక కేంద్ర మంత్రి రాజీనామాను చేయిచి సక్సెస్ అయిన సీజేపీకి ఇది మరో సవాల్ గా మారింది. అందుకే సీజేపీ కూడా ఎక్కడా తగ్గేది లేదని చెబుతోంది. అభిజిత్ దీప్కే అయితే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసి తీరాల్సిందే అని అంటున్నారు. ఒక వ్యక్తి కోసం ఇంతమందితో యుద్ధమా అని ఆయన మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోడీ అమిత్ షా ఇద్దరూ దేశ ప్రజలతో యుద్ధానికి సిద్ధపడుతున్నారని కూడా దీప్కే హాట్ కామెంట్స్ చేసారు.

కోట్ల ఓట్లు గల్లంతు :

అయితే కోట్ల ఓట్లు దేశంలో గల్లంతు అయ్యాయని, ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలు జరాగ్డం లేదని ఆయన మండిపడుతున్నారు. మరో వైపు చూస్తే విమానంలో అరేస్ట్ చేసిన అభిజిత్ దీప్కేని ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశానికి తీసుకుని వెళ్లారని చెబుతున్నారు. ఆయనతో పాటు సీజేపీ కీలక నేతలను కూడా ఢిల్లీలో ఆరు చోట్ల ఏర్పాటు చేసిన నిర్భంధ కేంద్రాలకు తరలించారని అంటున్నారు.

ఆంక్షలు ఎన్నాళ్ళు :

మరో వైపు చూస్తే అక్టోబర్ 10వ తేదీ ఒక్క రోజున మాత్రం ఢిల్లీ మొత్తం ఆంక్షలు పెట్టారు. రవాణా మొబైల్ ఇంటర్నెట్ వంటి వాటి మీద ఆంక్షలు కొనసాగాయి. అయితే ఎన్ని రోజులు ఈ ఆంక్షలు పెడతారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్క రోజు మాత్రమే వీటిని అమలు చేయగలరని అంటున్నారు. ఆ తరువాత అయినా వీటిని సడలిస్తే అపుడు జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలు జరిగి తీరుతాయని చెబుతున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్ వేదిక వద్దకు చేరుకోవడానికి యువత పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం ఉంది. దానిని అడ్డుకోవడం అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదని కూడా అంటున్నారు.

కేజ్రీవాల్ సైతం :

మరో వైపు సీజేపీ నిరసనలు మొదలయ్యేలోగా ఆప్ అధినేత కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద కుటుంబంతో సహా వచ్చి నిరవధిక దీక్షలకు సిద్ధపడతారని అంటున్నారు. సీఈసీ రాజీనామా చేసేంతవరకూ తన దీక్ష ఆగదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఆందోళనలు నిరసనలు జరపడం ప్రజా స్వామిక హక్కుగా ఆయన చెబుతున్నారు. దీనికి కూడా అనుమతించకుండా చేయడం ఏ వైఖరి అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News